- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
స్థానిక ఎన్నికలకు సిద్ధం కావాలి : భట్టి విక్రమార్క
దిశ,ఆమనగల్లు : స్థానిక సంస్థల ఎన్నికలకు కాంగ్రెస్ నాయకులంతా సిద్ధం కావాలని ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క తెలిపారు. శుక్రవారం జాతీయ రహదారి వెంట రోడ్డు మార్గాన వనపర్తి పర్యటనకు వెళుతున్న సందర్భంలో మార్గమధ్యలో ఆమనగల్ పట్టణ కేంద్రంలో పార్లమెంట్ సభ్యులు మల్లు రవితో కలిసి కాంగ్రెస్ నాయకులతో కాసేపు మాట్లాడారు. ఈ సందర్భంగా పీసీసీ సభ్యులు ఆయిళ్ల శ్రీనివాస్ గౌడ్, కాంగ్రెస్ నాయకులు ఉప ముఖ్యమంత్రి విక్రమార్క కు ఘన స్వాగతం పలికారు.
ఈ సందర్భంగా రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో సమిష్టి కృషితో అన్ని స్థానాల్లో గెలుపొందేలా కార్యాచరణ రూపొందించుకోవాలని దిశ నిర్దేశం చేశారు. ఈ కార్యక్రమంలో డిసిసి ఉపాధ్యక్షులు శ్రీపతి శ్రీనివాస్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి గుడూరు శ్రీనివాస్ రెడ్డి, ఆమనగల్లు మార్కెట్ మాజీ వైస్ చైర్మన్ గుర్రం కేశవులు, మార్కెట్ సభ్యులు వస్ఫూల శ్రీశైలం, అజీమ్,నాయకులు ధనంజయ, శ్రీనివాసరెడ్డి,మహేష్,అసిఫ్,అలీం,మండ్లి రాములు,విజయ్,కోట శ్రీను, సురేష్,విజేందర్,కండె సాయి, రాఘవేందర్, రామకృష్ణ,శ్రీకాంత్ తదితరులు ఉన్నారు.