Rajnath singh: మాల్దీవుల రక్షణ సామర్థ్యాలను బలోపేతం చేసేందుకు సిద్ధం.. రాజ్‌నాథ్‌ సింగ్

by vinod kumar |
Rajnath singh: మాల్దీవుల రక్షణ సామర్థ్యాలను బలోపేతం చేసేందుకు సిద్ధం.. రాజ్‌నాథ్‌ సింగ్
X

దిశ, నేషనల్ బ్యూరో: రక్షణ సామర్థ్యాలను బలోపేతం చేయడంలో మాల్దీవులకు సహకరించేందుకు భారత్ సిద్ధంగా ఉందని కేంద్ర మంత్రి రాజ్ నాథ్ సింగ్ (Rajnath singh) తెలిపారు. బుధవారం ఆయన ఇండియా పర్యటనలో ఉన్న మాల్దీవుల రక్షణ మంత్రి మహమ్మద్ ఘసన్ మౌమూన్‌తో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఇరు దేశాల ద్వైపాక్షిక సహకారంపై ఇరువురు చర్చించారు. ద్వైపాక్షిక రక్షణ, భద్రతా సహకారానికి సంబంధించిన వివిధ అంశాలపై సమగ్రంగా సమీక్షించారు. ‘రక్షణ సన్నద్ధత సామర్థ్యాన్ని పెంచడంలో మాల్దీవులతో సహకరించడానికి భారత్ సిద్ధంగా ఉంది. ద్వీప దేశ రక్షణ సన్నద్ధతను పటిష్టం చేసుకునేందుకు పూర్తి మద్దతిస్తాం’ అని రాజ్‌నాథ్ సింగ్ తెలిపారు. ప్రాంతీయ స్థిరత్వం, శ్రేయస్సును ప్రోత్సహించడానికి రూపొందించబడిన భారతదేశపు నైబర్‌హుడ్ ఫస్ట్ పాలసీలో మాల్దీవులకు ప్రత్యేక స్థానం ఉందని చెప్పారు. కాగా, మాల్దీవుల అధ్యక్షుడు మొహమ్మద్ ముయిజ్జూ తమ దేశం నుంచి భారత సైనిక సిబ్బందిని ఉపసంహరించుకున్న దాదాపు ఎనిమిది నెలల తర్వాత రక్షణ సంబంధాలపై ఇరు దేశాల మధ్య చర్చ జరగడం గమనార్హం.

Advertisement

Next Story

Most Viewed