ఎమ్మెల్యే కొలికిపూడి అల్టిమేటం.. సీఎం చంద్రబాబు అసంతృప్తి

by srinivas |
ఎమ్మెల్యే కొలికిపూడి అల్టిమేటం.. సీఎం చంద్రబాబు అసంతృప్తి
X

దిశ, వెబ్ డెస్క్: కృష్ణా జిల్లా తిరువూరు ఎమ్మెల్యే కొలికిపూడి శ్రీనివాసరావు(Thiruvur MLA Kolikipudi Srinivasa Rao) ప్రభుత్వానికి అల్టిమేటం జారీ చేసిన విషయం తెలిసిందే. అయితే ఈ అంశంపై సీఎం చంద్రబాబు నాయుడు(CM Chandrababu Naidu) ఆరా తీశారు. కొలికిపూడి వ్యవహారంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. పార్టీ నియోజకవర్గం నేతలు, కార్యకర్తలతో మాట్లాడారు. తిరువూరు నియోజకవర్గంలో వివాదలపై అసహనం వ్యక్తం చేశారు. తిరువూరులో సమస్యలు ఎందుకొస్తున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. పార్టీ నేతలు ఎవరైనా సరే నియోజకవర్గ కార్యకర్తల మనోభావాలకు అనుగుణంగా పని చేయాల్సిందేనని ఆదేశించారు.

కాగా గిరిజన మహిళపై లైంగిక వేధింపుల కారణంగా తిరువూరు టీడీపీ నేత రమేశ్ రెడ్డి(Ramesh Reddy)పై ఎమ్మెల్యే కొలికిపూడి శ్రీనివాసరావు ఆగ్రహం వ్యక్తం చేశారు. 48 గంటల్లో రమేశ్ రెడ్డిపై చర్యలు తీసుకోకపోతే తాను రాజీనామా చేస్తానంటూ కొలిపూడి హెచ్చరించారు. దీంతో కొలికిపూడి తీరుపై అధిష్టానానికి ఫిర్యాదు అందాయి. ఈ మేరకు నియోజవకర్గం నుంచి నివేదికలు తెప్పించుకున్నారు. కొలికిపూడి వ్యవహారంపై సీరియస్ అయ్యారు. పార్టీ నియమ, నిబంధనలు సూచించారు. క్షమ శిక్షణగా ఉండాలని ఆదేశించారు.

Next Story

Most Viewed