ఎకరం రూ.కోటి పలకాలంటే అలా జరగాలి.. CM రేవంత్ కీలక వ్యాఖ్యలు

by Gantepaka Srikanth |
ఎకరం రూ.కోటి పలకాలంటే అలా జరగాలి.. CM రేవంత్ కీలక వ్యాఖ్యలు
X

దిశ, వెబ్‌డెస్క్: అధికారం పోతే అసెంబ్లీకి రాని వాళ్లకు జరగాల్సింది జరిగిందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) అన్నారు. తలుపులు విరగ్గొట్టిన పాపం ఇప్పుడు అనుభవిస్తున్నారని పరోక్షంగా బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌(KCR)పై కీలక వ్యాఖ్యలు చేశారు. శనివారం కొడంగల్(Kodangal) నియోజకవర్గ కాంగ్రెస్ నేతలతో సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అధికారం పోయిందనేదే బీఆర్ఎస్ బాధ అని విమర్శించారు. అందుకే కొడంగల్‌ అభివృద్ధిని దెబ్బతీయాలనే కుట్ర చేస్తున్నారని మండిపడ్డారు. కొడంగల్‌ను కాపాడుకునే, అభివృద్ధి చేసుకునే బాధ్యత నాది అని హామీ ఇచ్చారు. తెలంగాణ ముఖ్యమంత్రి(Telangana CM) సీటు పదేళ్ల పాటు కొడంగల్‌దే అని కీలక ప్రకటన చేశారు. అభివృద్ధిని అడ్డుకుంటే అందరం మునిగిపోతామని చెప్పారు. కొడంగల్ భూముల విలువ ఎకరం కోటి రూపాయలు కావాలంటే అభివృద్ధిని ఆపాలని చూసే ఇంటి దొంగలను పసి గట్టాలని అన్నారు. అలాంటి వారిని కొడంగల్ ప్రజలు వదలొద్దని తెలిపారు.

Next Story

Most Viewed