Ramadan Wishes: ముస్లిం సోదరులకు జగన్ ఈద్ ముబారక్

by srinivas |   ( Updated:2025-03-29 17:26:14.0  )
Ramadan Wishes: ముస్లిం సోదరులకు జగన్ ఈద్ ముబారక్
X

దిశ, వెబ్ డెస్క్: ముస్లిం సోదరులకు మాజీ సీఎం జగన్ మోహన్ రెడ్డి(Former CM Jagan Mohan Reddy) శుభాకాంక్షలు తెలిపారు. రంజాన్ పండగ(Ramadan Festival) ఎంతో పవిత్రమైనదని, సామరస్యానికి, సుహృద్భావానికి, సమానత్వానికి, కరుణకు, దాతృత్వానికి ప్రతీక అని ఆయన తెలిపారు. అల్లాహ్ దీవెనలతో తెలుగు ప్రజలతో పాటు ప్రపంచ మానవాళికి శుభాలు కలగాలన్నారు. క్రమశిక్షణ, దాతృత్వం, ధార్మిక చింతనల కలయితే రంజాన్ మాసం విశిష్టత అని తెలిపారు. ఈ మాసంలో పవిత్ర దివ్య ఖురాన్ అవతరించిందని, ఈ సందర్భంగా ముస్లిం సోదరులు ఎంతో శ్రద్ధగా ఉపవాస దీక్షలు చేస్తారని పేర్కొన్నారు. ఈ ఉపవాస దీక్షలకు ముగింపు వేడుక రంజాన్ అని తెలిపారు. మనిషిలోని చెడును, అధర్మాన్ని, ద్వేషాన్ని పోగొట్టే గొప్ప పండగ రంజాన్ అని జగన్ స్పష్టం చేశారు.

Next Story