Yogi: వక్ఫ్ పేరుతో లాక్కున్న భూములన్నీ వెనక్కి తీసుకుంటాం.. యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్

by vinod kumar |
Yogi: వక్ఫ్ పేరుతో లాక్కున్న భూములన్నీ వెనక్కి తీసుకుంటాం.. యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్
X

దిశ, నేషనల్ బ్యూరో: వక్ఫ్ బోర్డు పేరుతో భూమిని ఆక్రమించిన వారి నుంచి ప్రతి అంగుళం భూమిని వెనక్కి తీసుకుంటామని యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ (Yogi aadithya nath) తెలిపారు. అవి వక్ఫ్ బోర్డులా లేక ల్యాండ్ మాఫియా బోర్డులా అనేది అర్థం కావడం లేదన్నారు. ప్రభుత్వం వక్ఫ్ చట్టాన్ని సవరించి ప్రతి ఇంచు భూమిని పరిశీలిస్తోందని, వక్ఫ్ పేరుతో ఆక్రమించిన భూమిని వెనక్కి తీసుకుని పేదలకు ఇళ్లు, విద్యాసంస్థలు, ఆస్పత్రులు నిర్మిస్తామన్నారు. బుధవారం ఆయన ఓ కార్యక్రమంలో భాగంగా మాట్లాడారు. మతపరమైన స్థలాలపై వివాదాలు పాత గాయాలని, వాటికి సకాలంలో చికిత్స చేయకపోతే అవి క్యాన్సర్‌గా మారతాయని అభిప్రాయపడ్డారు. వక్ఫ్ సాకుతో కబ్జా చేసిన భూముల వివరాలను తెలుసుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వం రెవెన్యూ రికార్డులను పరిశీలిస్తున్నట్లు తెలిపారు. అనంతరం ఆక్రమణకు గురైన భూమిని స్వాధీనం చేసుకుంటామని స్పష్టం చేశారు. సంభాల్‌లో ఇటీవల జరిగిన హింసాత్మక పరిస్థితులపై స్పందిస్తూ.. కోర్టు ఆదేశాల మేరకు సర్వే నిర్వహించామని, అయితే కొన్ని అంశాలు అక్కడ ఇబ్బందిని సృష్టించాయన్నారు. స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుంచి సంభాల్‌లో వందలాది మంది హిందువులను ఊచకోత కోశారని, కానీ దోషులపై ఎలాంటి చర్యలు తీసుకోలేదని ఆరోపించారు.

Advertisement

Next Story

Most Viewed