- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
GHMC: జీహెచ్ఎంసీకి బిగ్ రిలీఫ్! ఏడాదిన్నరలో రూ.6,066 కోట్ల కేటాయింపు

దిశ, తెలంగాణ బ్యూరో: కాంగ్రెస్ ప్రభుత్వ పాలనలో గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్‌కు మంచి రోజులొచ్చాయి. ఒకప్పుడు నిధులతో బల్దియా ఖజానా కలకలాడింది. కానీ ప్రస్తుతం అప్పుల కుప్పైంది. 2013లో రూ.1,000 కోట్లు పిక్డ్స్ డిపాజిట్లు ఉన్నాయి. తెలంగాణ ఏర్పాటు తర్వాత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో జీహెచ్ఎంసీ నిధులను ఆయా శాఖలకు పంచించింది. ఫలితంగా అప్పుల పాలైంది. ఏ చిన్న పనిచేయాలన్నా సర్కార్‌పై ఆధారపడాల్సి వచ్చేది. అయితే కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో బల్దదియాకు మంచి రోజులు వచ్చాయనే చెప్పాలి. అందుకు ఏడాదిన్నర కాలంలో కేటాయించిన నిధులు, విడుదల చేసిన నిధులే నిదర్శనం. పదేండ్ల బీఆర్ఎస్ పాలనలో జీహెచ్ఎంసీకి రూ.1025.26 కోట్లు కేటాయిస్తే ఏడాదిన్న కాంగ్రెస్ పాలనలో రూ.6,066.61 కోట్లు కేటాయించింది. దీంతో పాటు జీహెచ్ఎంసీ ఊపిరి పీల్చుకున్నట్టేనని అధికారులు చెబుతున్నారు.
ఏడాదిన్నర కాలంలో..
ఏడాదిన్నర కాలంగా ప్రభుత్వం నుంచి జీహెచ్ఎంసీ నిధులు వచ్చాయి. రెండు బడ్జెట్‌లలో కలిపి రూ.6,066.61 కోట్లు కేటాయించారు. మొదటి బడ్జెట్‌లో కేటాయించిన రూ.2,965.61 కోట్లకుగాను రూ.1602.52 కోట్లు విడుదల చేసింది. బడ్జెట్‌తో సంబంధం లేకుండా స్టాంప్ డ్యూటీ నిధులు రూ.3,030 కోట్లు విడుదల చేసింది. ఈసారి బడ్జెట్‌లోనూ రూ.3,101 కోట్లు కేటాయించింది. వీటితో పాటు హైదరాబాద్ మహానగరంలో మౌలిక సదుపాయాల కల్పనతో పాటు ట్రాఫిక్ రద్దీ నియంత్రణకు హెచ్-సిటీలో రూ.7,032 కోట్లతో 31 ఫ్లైఓవర్లు, 17 అండర్ పాసులు, 10 రోడ్లను విస్తరించాలని ప్రభుత్వం పనులు ప్రారంభించింది. దీంతో పాటు రూ.150 కోట్లతో సుందరీకరణ పనునలు చేపట్టాలని నిర్ణయించింది. అయితే ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన హెచ్-సిటీ ప్రాజెక్టులకు గత బడ్జెట్‌లో రూ.2,654 కోట్లు, ఈసారి బడ్జెట్‌లోనూ రూ.2,654 కోట్లు కలిపి రూ.5,308 కేటాయించింది. వీటితో పాటు ప్రాజెక్టుల నిర్మాణం సందర్భంగా భూసేకరణ కోసం బడ్జెట్‌లో రూ.18.11 కోట్లు కేటాయించింది.
పదేళ్ల కాలంలో..
గత పదేండ్ల కాలంలో జీహెచ్ఎంసీ గడ్డు పరిస్థితులను ఎదుర్కొన్నది. ప్రాజెక్టుల నిర్మాణానికి నిధులులేక, సర్కార్ నుంచి సాయంలేక అప్పులు చేయకతప్పలేదు. వెరసి పదేండ్ల కాలంలో అప్పులు రూ.6,800 కోట్లకు చేరాయి. ఇదిలా ఉంటే బీఆర్ఎస్ ప్రభుత్వ పదేండ్ల కాలంలో జీహెచ్ఎంసీకి కేటాయించింది రూ.1,025.26 కోట్లు మాత్రమే. వీటిలో విడుదల చేసింది మాత్రం రూ.460.79కోట్లే. జీహెచ్ఎంసీ 2016 నుంచి 2023 వరకు వివిధ పనుల కోసం రూ.6,880 కోట్ల అప్పులు చేసింది. ప్రతినెల అప్పులు, వడ్డీ కలిపి సుమారు రూ.150 కోట్ల మేర చెల్లించాల్సిన పరిస్థితి దాపురించింది. అప్పటి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన ఎస్ఆర్డీపీ కోసం నిధులే కేటాయించలేదు. ఇక భూసేకరణ గురించి చెప్పనక్కర్లేదు. ఇప్పటికీ రూ.500 కోట్లు పెండింగ్‌లో ఉన్నాయి. భూసేకరణ సందర్బంగా జారీచేసిన ట్రాన్స్‌ఫర్ డెవలప్‌మెంట్ రైట్స్(టీడీఆర్)లపై బాధితులు మండిపడుతున్నారు.
పదేండ్ల కాలంలో బడ్జెట్‌లలో కేటాయింపులు, విడుదల చేసిన నిధుల వివరాలు ఇలా ఉన్నాయి.
ఏడాది - కేటాయింపులు (రూ.కోట్లలో) - విడుదల చేసినవి(రూ.కోట్లలో)
2014-15 370.93 - 314.85
2015-16 362.51 - 136.26
2016-17 68.98 - 0
2017-18 62.23 - 9.34
2018-19 65.11 - 0.34
2019-20 20.10 - 0
2020-21 17.60 - 0
2021-22 17.60 - 0
2022-23 20.10 - 0
2023-24 20.10 - 0