మలేషియన్ ఓపెన్ -2025 : ప్రీ క్వార్టర్ ఫైనల్‌కు ప్రణయ్, మాల్విక

by Sathputhe Rajesh |
మలేషియన్ ఓపెన్ -2025 : ప్రీ క్వార్టర్ ఫైనల్‌కు ప్రణయ్, మాల్విక
X

దిశ, స్పోర్ట్స్ : భారత బ్యాడ్మింటన్ స్టార్ హెచ్ఎస్ ప్రణయ్ మలేషియన్ ఓపెన్ సూపర్ 1000 బ్యాడ్మింటన్ టోర్నీలో గెలుపుతో ప్రీ-క్వార్టర్ ఫైనల్‌కు చేరుకున్నాడు. బుధవారం కౌలలంపూర్ వేదికగా జరిగిన తొలి మ్యాచ్‌లో కెనడాకు చెందిన బ్రియన్ యంగ్‌‌పై 21-12, 17-21, 21-15 తేడాతో గెలిచాడు. 29 నిమిషాలు సాగిన మ్యాచ్‌లో అద్భుతంగా ఆడిన ప్రణయ్ విజయంతో ఈ ఏడాదిని విజయంతో ప్రారంభించాడు. తన తదుపరిలో ప్రణయ్ చైనాకు చెందిన షి ఫెంగ్ లీతో తలపడనున్నాడు.

సింగిల్స్‌లో మాల్విక బన్సోద్

మహిళల సింగిల్స్ విభాగంలో మాల్విక బన్సోద్ అద్భుత విజయం సాధించింది. 45 నిమిషాలు సాగిన మ్యాచ్‌లో మలేషియాకు చెందిన గో జిన్ వై‌పై 21-15, 21-16 తేడాతో గెలిచింది. తద్వారా ప్రీ క్వార్టర్ ఫైనల్‌కు అర్హత సాధించింది. మిక్స్‌డ్ డబుల్స్ విభాగంలో తనీషా క్రాస్టో-ధ్రువ్ కపిల జోడీ సౌత్ కోరియాకు చెందిన కో సుంగ్ హ్యున్-ఇవోమ్ హై పై 21-13, 21-14 తేడాతో వరుస సెట్లలో గెలిచారు. సతీష్ కరుణాకరన్-ఆద్య వారియత్ భారత్‌కే చెందిన ఆశిత్ సూర్య-అమృత ప్రముతేష్‌లపై విజయం సాధించి ప్రీ క్వార్టర్ ఫైనల్‌కు అర్హత సాధించారు.

Advertisement

Next Story

Most Viewed