Baba Vanga:  బాబా వంగ ఎవరు.. ఆమె చూపును ఎలా కోల్పోయింది.. అతీంద్రియ శక్తులు ఎలా వచ్చాయంటే..?

by Prasanna |   ( Updated:2025-01-09 09:35:54.0  )
Baba Vanga:  బాబా వంగ ఎవరు.. ఆమె చూపును ఎలా కోల్పోయింది.. అతీంద్రియ శక్తులు ఎలా వచ్చాయంటే..?
X

దిశ, వెబ్ డెస్క్ : బాబా వంగ ( Baba Vanga ) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆమె బల్గెరియాలో 1911 లో జన్మించారు. ఆమె తన 12 ఏళ్ల వయస్సులో ఇంటి నుంచి బైటకు వెళ్లారు. ఆ రోజు భారీగా పడటంతో పిడుగులు పడ్డాయట. అయితే.. బాబా వంగ ఒక్కతే వర్షంలో చిక్కుకుపోయిందంట. అప్పుడు, పిడుగు పడే సమయంలో బాబా వంగ చూడటం వలన ఆమె తన చూపును కోల్పోయింది.

తనకు కళ్లు కన్పించడంలేదని చాలా చాలా ఏడ్చిందట. హాస్పిటల్ కు తీసుకెళ్లగా.. పిడుగు ప్రభావం వల్ల చూపు పోయిందని చెప్పారంట. ఇక అప్పటి నుంచి ఆమెకు అతీంద్రియ శక్తులు వచ్చాయని చెబుతుంటారు. చూపు లేకపోయిన ఆమె తన పనులను తాను సులభంగా చేసుకునేదట .

ఆమె దైవదూతలతో కూడా మాట్లాడేదని చెబుతున్నారు. ఇక, కొన్నిరోజులకి బాబా వంగ భవిష్యత్తును ఊహించి.. చెప్పడం మొదలు పెట్టింది. మొదట్లో ఆమెను పట్టించుకోలేదు.. క్రమంగా ఆమె చెప్పినవన్ని జరుగుతుండంతో ఇక అందరూ ఆమెను పూజించడం మొదలు పెట్టారు. రష్య ఉక్రెయిన్ యుద్దాల్ని సైతం ముందే ఊహించి చెప్పింది. అలాగే, కరోనాను కూడా ముందే ఊహించారంట. ప్రస్తుతం, బాబా వంగ 2025 భవిష్యత్తు గురించి చెప్పిన జాతకం ఇప్పుడు ప్రపంచ దేశాలకు కూడా వణుకు పుట్టిస్తుంది.

Advertisement

Next Story