చరిత్రలో ఎన్నడూ జరగని ఘోరం జరిగింది: రాంబాబు

by Mahesh |
చరిత్రలో ఎన్నడూ జరగని ఘోరం జరిగింది: రాంబాబు
X

దిశ, వెబ్ డెస్క్: తిరుమల(Tirumala) తొక్కిసలాట(stampede) ఘటనపై మాజీ మంత్రి(Former Minister) అంబటి రాంబాబు(Ambati Rambabu) స్పందించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. తిరుపతి చరిత్ర(Tirupati History)లో ఎన్నడూ జరగని ఘోర ప్రమాదం(fatal accident) జరిగిందన్నారు. కాగా ఈ విషాదకర ఘటనకు టీటీడీ చైర్మన్‌ బీఆర్ నాయుడు, ఈవో శ్యామల రావు, జేఈవోలే ఈ ఘటనకు ప్రధాన కారణం అంటూ సంచలన ఆరోపణలు చేశారు. సదరు అధికారులు టీటీడీ కంటే టీడీపీకే ఎక్కువ సేవ చేస్తున్నారన్నారు. గత ప్రభుత్వ సమయంలో మాజీ సీఎం జగన్‌ కొండ మీదకు వస్తానంటే పెద్ద బోర్డులు పెట్టారని గుర్తు చేశారు. కానీ ప్రస్తుతం భక్తులకు కనీస సదుపాయాలు కల్పించలేదని, తొక్కిసలాట ఘటనతో అధికారులపై కోపాన్ని చూపించి చంద్రబాబు ఏం సాధించారని అంబటి రాంబాబు ప్రశ్నించారు. కాగా బుధవారం రాత్రి తిరుమలలో శ్రీవారి వైకుంఠ ద్వార దర్శనం టోకెన్ల జారీ సందర్భంగా తొక్కిసలాట జరిగి ఆరుగురు మృతి చెందారు. అలాగే మరో నలుగురికి తీవ్ర గాయాలు కాగా వారి పరిస్థితి విషమంగా మారడంతో స్విమ్స్ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. అలాగే మరో 40 మందికి గాయాలు కాగా చికిత్స నిమిత్తం 24 మందిని డిశ్చార్జ్ చేసినట్లు డాక్టర్లు, అధికారులు తెలిపారు.

Advertisement

Next Story