- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
‘మహానదిగా విలసిల్లిన తెలుగు.. ఇప్పుడు పిల్ల కాలువగా మారుతోంది’: పురందేశ్వరి
దిశ,వెబ్‌డెస్క్: ఏపీలోని తూర్పుగోదావరి జిల్లా రాజానగరంలో రెండో ప్రపంచ తెలుగు మహాసభలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ ప్రపంచ తెలుగు మహాసభల్లో బీజేపీ ఏపీ రాష్ట్ర అధ్యక్షురాలు(BJP AP State President), ఎంపీ పురందేశ్వరి(MP Purandeswari) పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు. అమ్మ భాష గొప్పతనం గురించి ఆమె అద్భుతంగా వర్ణించారు. మాతృభాషను పరిరక్షించుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందని ఆమె పేర్కొన్నారు. అమ్మ భాషను పరిరక్షించుకోకపోతే అది మన ఉనికికే ప్రమాదం. దేశంలో ప్రాచీన భాషగా గుర్తింపు పొందిన ఆరు భాషల్లో తెలుగు ఒకటని తెలిపారు.
ఈ క్రమంలో ప్రపంచవ్యాప్తంగా ఎక్కువ మంది మాట్లాడే భాషల్లో తెలుగు 15వ భాష అని పేర్కొన్నారు. మన దేశంలో ఎక్కువగా మాట్లాడే వాటిలో నాలుగోవది అన్నారు. ‘దేశ భాషలందు తెలుగు లెస్స’ అని శ్రీ కృష్ణాదేవరాయలు(Sri Krishnadevaraya) ఎప్పుడో చెప్పారని ఆమె గుర్తు చేశారు. తెలుగులో జీవోలు ఇవ్వాలన్న ప్రభుత్వ నిర్ణయం ఆనందదాయకం. ఎన్టీఆర్ ఉన్నప్పుడు జీవోలు తెలుగులో ఇచ్చేవారు అని తెలిపారు. ‘మహానదిగా విలసిల్లిన తెలుగు.. ఇప్పుడు పిల్ల కాలువగా మారుతోందని బాధగా ఉంది’ అని ఆమె ఆవేదన వ్యక్తం చేసింది.