- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
Spadex: స్పేడెక్స్ డాకింగ్ మళ్లీ వాయిదా.. వెల్లడించిన ఇస్రో
దిశ, నేషనల్ బ్యూరో: ఈ నెల 9న జరగాల్సిన రెండు స్పేస్ డాకింగ్ ఎక్స్‌పెరిమెంట్ (Spadex) ఉపగ్రహాల డాకింగ్‌ను మరోసారి వాయిదా వేసినట్టు భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ISRO) ప్రకటించింది. దీంతో రెండు రోజుల్లోనే రెండో సారి పోస్ట్ పోన్ చేసింది. అంతకుముందు ఈ నెల 7వ తేదీనే డాకింగ్ చేయాలని నిర్ణయించగా సాంకేతిక కారణాలతో గురువారానికి వాయిదా వేయగా ఈ నేపథ్యంలోనే మరోసారి రద్దు చేశారు. ఉపగ్రహాల మధ్య 225 మీటర్లకు చేరుకునేలా కసరత్తు చేస్తున్నప్పుడు, విజిబిలిటీ పీరియడ్ తర్వాత డ్రిఫ్ట్ ఊహించిన దానికంటే ఎక్కువగా ఉందని ఇస్రో తెలిపింది. అందుకే డాకింగ్ ప్రక్రియను వాయిదా వేస్తున్నట్టు వెల్లడించింది. అయితే ఉపగ్రహాలు కూడా సురక్షితంగా ఉన్నాయని తెలిపింది. శాటిలైట్స్ అనుసంధానం చేయడానికి ఈ నెల 10వరకు సమయం ఉంది. కాగా, అంతరిక్ష నౌకల రెండెజౌస్, డాకింగ్, అన్‌డాకింగ్ కోసం అవసరమైన సాంకేతికతను అభివృద్ధి చేయడమే స్పేడెక్స్ లక్ష్యం. ఇది విజయవతమైతే అమెరికా, చైనా, రష్యాల తర్వాత స్పేస్ డాకింగ్ టెక్నాలజీని కలిగి ఉన్న దేశాల ఎలైట్ క్లబ్‌లో నాలుగో దేశంగా భారత్ చేరుతుంది.