Tragedy:మామ, కోడలును ఢీకొన్న టిప్పర్.. ఒకరు స్పాట్ డెడ్

by Jakkula Mamatha |   ( Updated:2025-01-09 09:37:37.0  )
Tragedy:మామ, కోడలును ఢీకొన్న టిప్పర్.. ఒకరు స్పాట్ డెడ్
X

దిశ ప్రతినిధి, ఎన్టీఆర్ జిల్లా: ఎనికెపాడు శివాలయం సెంటర్ తాడిగడప వంద అడుగుల రోడ్డు సర్కిల్ వద్ద ఈరోజు 12:30 గంటల సమయంలో రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. మామ, కోడలు ఇద్దరు బైక్ పై వస్తూ రోడ్ క్రాసింగ్ చేస్తుండగా అటుగా వస్తున్న టిప్పర్ లారీ అతివేగంతో బైకును ఢీకొనడంతో బైకు లారీ కిందపడి కోడలు స్పాట్ లోనే మరణించడం జరిగింది. వయసు సుమారు 22 సంవత్సరాలు ఎర్రం శెట్టి సుష్మ. ఎనికేపాడు వాసులుగా గుర్తింపు చెప్పుకుంటున్నారు. మామకు కాలు విరిగింది. పోలీసులు క్షతగాత్రులను అంబులెన్స్ లో గవర్నమెంట్ హాస్పిటల్ కి తరలించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

Next Story