క్రీడలతో మానసిక ప్రశాంతత

by Sridhar Babu |
క్రీడలతో మానసిక ప్రశాంతత
X

దిశ, ఆదిలాబాద్ : అనునిత్యం విధులలో నిమగ్నమైన జిల్లా పోలీసులకు క్రీడలతో మానసిక ప్రశాంతత, శారీరక దృఢత్వాన్ని పొందొచ్చని ఆదిలాబాద్ జిల్లా కలెక్టర్ రాజర్షి షా అన్నారు. పోలీసులకు ఆటవిడుపుగా జిల్లా పోలీసు వార్షిక క్రీడలలో భాగంగా గురువారం స్థానిక పోలీస్ హెడ్ క్వార్టర్స్ లోని పరేడ్ మైదానంలో జిల్లా కలెక్టర్ రాజర్షి షా, జిల్లా ఎస్పీ గౌస్ ఆలం, ఉట్నూర్ ఏఎస్పీ కాజల్ పాల్గొని పోలీసు క్రీడలను ప్రారంభించారు. అంతకు ముందు ఐదు బృందాలుగా ఉన్న డీఏఆర్ ఈగల్స్, క్యూఆర్టీ విక్టర్స్, ఆదిలాబాద్ స్ట్రైకర్స్, ఉట్నూర్ చాలెంజర్స్, హెచ్జీ హంటర్స్ లుగా ఉంటూ చక్కటి పరేడ్ ను నిర్వహించారు. ముఖ్య అతిథులకు పోలీసులు గౌరవ వందనం చేయగా జిల్లా కలెక్టర్, ఎస్పీ స్పోర్ట్స్ జెండాను ఆవిష్కరించి, శాంతి కపోతాలను, బెలూన్లను గాలిలోకి ఎగుర వేశారు.

ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ క్రీడలను ఆడుతూ మానసిక శారీరక దృఢత్వాన్ని పొందాలని అన్నారు. ఇలాంటి క్రీడా పోటీలలోనే ప్రతి ఒక్కరి ప్రతిభ కనబడుతుందని తెలిపారు. క్రీడలలో గెలుపోటములు సహజమని, ప్రతి ఒక్కరూ క్రీడా స్ఫూర్తితో పోటీలలో పాల్గొనాలని కోరారు. ఎస్పీ మాట్లాడుతూ పోలీసులు అనునిత్యం వివిధ రకాలైన విధులలో నిమగ్నమై ఉంటారని, వాటిని మరచిపోతూ ఉల్లాసంగా ఉత్సాహంగా ఆనందోత్సవాల మధ్య ఈ వార్షిక క్రీడల పోటీలలో పాల్గొనాలని కోరారు. ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ బి.సురేందర్రావు, ఉట్నూర్ ఏఎస్పీ కాజల్, డీఎస్పీలు పోతారం శ్రీనివాస్, ఎల్.జీవన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story