- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
కలాం కన్న కలలను సహకారం చేసి శాస్త్రవేత్తలుగా ఎదగాలి : కలెక్టర్ బీఎం.సంతోష్
దిశ, గద్వాల కలెక్టరేట్ : అబ్దుల్ కలాం స్ఫూర్తితో విద్యార్థులు సాంకేతిక పరిజ్ఞానంపై అవగాహన సామర్థ్యం పెంపొందించుకొనాలని జిల్లా కలెక్టర్ బీఎం సంతోష్ అన్నారు. గురువారం స్థానిక ఇండోర్ స్టేడియం గ్రౌండ్ లో పాఠశాల విద్యార్థులకు సైన్స్, టెక్నాలజీ పై అవగాహన కల్పించాలనే ఉద్దేశంతో నిర్వహించిన కలాం స్ఫూర్తి యాత్ర కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న జిల్లా కలెక్టర్ సంతోష్ మాట్లాడుతూ...ఏపీజే అబ్దుల్ కలాం తో పాటు ఇస్రో శాస్త్రవేత్తలు స్వయంగా తను కూడా ప్రభుత్వ పాఠశాలలో చదువుకొని ఉన్నత స్థాయికి ఎదగడం జరిగిందన్నారు. నేటి సమాజంలో విద్యార్థులు వైజ్ఞానికత,నూతన ఆవిష్కరణలు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని పెంపొందించుకొని కలాం కన్న కలలను సహకారం చేసి శాస్త్రవేత్తలుగా ఎదగాలన్నారు.
ఫ్లో బస్సు ద్వారా రోబోటిక్స్ 3D ప్రింటింగ్ ఏఆర్, విఆర్, ఎంఎల్ వంటి సాంకేతికత పరిజ్ఞానాన్ని పెంపొందించుకోవాలన్నారు. ప్రస్తుత సమాజంలో ప్రతి ఒక్కరు మొబైల్ వినియోగించడం జరుగుతుందని, రాబోవు రోజులలో అన్ని పనులను రోబోటిక్ ద్వారా చేపట్టడం జరుగుతుందన్నారు. ఈ యాత్ర ద్వారా ఆధునిక సాంకేతికతను నేరుగా పాఠశాలల విద్యార్థుల వద్దకు తీసుకువెళ్లి వారికి ప్రేరణ కల్పించడం సంతోషించదగ్గ విషయం అన్నారు. విద్యార్థులు సాంకేతికత పట్ల అవగాహన పెంపొందించుకొని కలాం స్ఫూర్తితో ముందుకు సాగాలని, సైంటిస్టులు గా ఎదగాలని ఆకాంక్షించారు. ఈ సందర్భంగా ఫ్లో బస్సులో ఏర్పాటు చేసిన టెక్నాలజీని శాసనసభ్యులు బండ్ల కృష్ణమోహన్ రెడ్డి తో కలిసి కలెక్టర్ వీక్షించారు. విద్యార్థులకు ఈ సాంకేతికత ఎంతగానో ఉపయోగపడుతుందని, రాష్ట్రంలోని అన్ని జిల్లాలలో ఈ యాత్ర విజయవంతంగా నిర్వహించి విద్యార్థులకు అవగాహన కల్పించాలని కలాం స్ఫూర్తి యాత్ర నిర్వహకులకు సూచించారు. గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి మాట్లాడుతూ...అబ్దుల్ కలాం కళలను సహకారం చేసేందుకు ఆధునిక సాంకేతికత పరిజ్ఞానాన్ని పాఠశాల విద్యార్థులకు ప్రేరణ కల్పించాలనే ఉద్దేశంతో "కలాం స్ఫూర్తి యాత్ర" నిర్వహించడం ముఖ్య ఉద్దేశం అన్నారు.
నేటి సమాజం సాంకేతికంగా ఎంతగానో అభివృద్ధి చెందిందని, నేడు దేశం ప్రపంచ దేశాలతో పోటీ పడుతుందని, దేశాభివృద్ధికి సాంకేతికత ఎంతో అవసరమని, సాంకేతిక పరిజ్ఞానాన్ని విద్యార్థులు పెంపొందించుకొని దేశాభివృద్ధికి పాటుపడాలన్నారు. కలాం స్ఫూర్తి యాత్రలో భాగంగా బస్సులో ఏర్పాటు చేసిన 16 అంశాలతో కూడిన సాంకేతిక పరిజ్ఞానాన్ని తిలకించే విద్యార్థులు అవగాహన కల్పించుకోవాలన్నారు. వంద మంది చేసే పనిని ఈరోజు ఒక కంప్యూటర్ ద్వారా నిర్వహించడం జరుగుతుందని, రాబోవు రోజులలో సాంకేతికంగా ఇంకా ఎంతో అభివృద్ధి చెందాల్సిన అవసరం ఉందన్నారు. ఈ సందర్భంగా నిర్వాహకులచే ముఖ్య అతిథులకు ఘనంగా మానించారు. ఈ కార్యక్రమంలో జిల్లా యువజన సంక్షేమ శాఖ అధికారి జితేందర్, ఉపాధ్యాయులు స్థానిక ప్రజా ప్రతినిధులు, కళా స్ఫూర్తి యాత్ర సీఈఓ మధులాష్ బాబు తదితరులు పాల్గొన్నారు.