- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
వైఎస్ జగన్‌కు నాంపల్లి కోర్టులో ఊరట.. విదేశీ పర్యటనకు అనుమతి
దిశ, వెబ్ డెస్క్: ఆంధ్రప్రదేశ్ మాజీ సీఎం జగన్(Former CM Jagan)కు నాంపల్లి కోర్టు(Nampally Court)లో ఊరట(relief) లభించింది. ఫ్యామిలీతో కలిసి విదేశాలకు వెళ్లడానికి అనుమతించాలని జగన్ వేసిన పిటిషన్ పై విచారించిన నాంపల్లి కోర్టు ఆయన విదేశీ పర్యటన(Foreign trip)కు అనుమతి ఇచ్చింది. దీంతో ఈ నెల 11 నుంచి 30 వరకు లండన్ వెళ్లేందుకు న్యాయస్థానం జగన్‌కు పర్మీషన్ ఇచ్చింది(Permission given). దీంతో ఆయన దాదాపు 22 రోజుల పాటు కుటుంబ సభ్యులతో కలిసి లండన్ వెకేషన్ వెళ్లనున్నారు. ముఖ్యంగా జగన్ కుమార్తె గ్రాడ్యుయేషన్ వేడుకల్లో పాల్గొనేందుకు కోర్టు నుంచి అనుమతి కోరినట్లు తెలుస్తోంది. కాగా క్విడ్ ప్రోకో కేసులకు సంబంధించి సీబీఐ(CBI) దాఖలు చేసిన కేసుల్లో మాజీ సీఎం వైఎస్ జగన్ షరతులతో కూడిన బెయిల్‌పై ఉన్నారు. ఆయన విదేశాలకు వెళ్లాలంటే సీబీఐ కోర్టు(CBI Court) అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది.