తాళం పనిచేయక మూతపడిన కుంట్లూరు కెనరా బ్యాంక్

by Aamani |
తాళం పనిచేయక మూతపడిన కుంట్లూరు కెనరా బ్యాంక్
X

దిశ, అబ్దుల్లాపూర్మెట్: రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్మెట్ మండలం కుంట్లూర్ గ్రామంలో గల కెనరా బ్యాంకు మూత పడింది. ఎప్పటిలాగే ప్రతి రోజు బ్యాంకు తెరిచేందుకు బ్యాంకు సిబ్బంది బుధవారం ఉదయం 9:30 గంటలకు వచ్చారు. అనంతరం తమ వద్ద ఉన్న తాళాలతో షట్టర్ తాళాలు తీసేందుకు ప్రయత్నించగా అవి రాలేదు. పలుమార్లు ప్రయత్నం చేసినప్పటికీ రాకపోవడంతో సిబ్బంది అధికారులు అక్కడే ఉండిపోయారు. సమయానుసారంగా వచ్చిన బ్యాంక్ కస్టమర్లకు మాత్రం షట్టర్లు తెరవకపోవడంతో కొంతమేర ఇబ్బందులు పడ్డారు. అధికారులు ఉన్నతాధికారులకు సమాచారం చేరవేయగా, సిబ్బంది బ్యాంకు బయటనే కూర్చుండిపోయారు. ఏది ఏమైనా తాళాలు ఓపెన్ కాక బుధవారం కెనరా బ్యాంక్ మూతపడడంతో స్థానికంగా ఇంకేమైనా జరిగిందా అన్న చర్చ అనే అంశం మొదలైంది.

Advertisement

Next Story

Most Viewed