తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ.. దర్శనానికి 12 గంటల సమయం

by Mahesh |   ( Updated:2025-01-07 02:48:40.0  )
తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ.. దర్శనానికి 12 గంటల సమయం
X

దిశ, వెబ్ డెస్క్: ఆంధ్రప్రదేశ్ లోని తిరుమల తిరుపతి దేవస్థానం(Tirumala Tirupati Devasthanam)లో మరోసారి భక్తుల రద్దీ(Devotees Crowd) పెరిగింది. చలి తీవ్ర అధికంగా ఉన్నప్పటికీ తిరుమలకు భక్తుల తాకిడి మాత్రం తగ్గడం లేదు. తిరుమల కొండపై ఉన్న 16 కంపార్ట్‌మెంట్లలో వేచిఉన్న భక్తులు శ్రీవారి దర్శనం కోసం వేచి చూస్తున్నారు. దీంతో స్వామి వారి సర్వదర్శనానికి 12 గంటల సమయం పడుతున్నట్లు టీటీడీ అధికారులు(TTD officials) తెలిపారు. ఇదిలా ఉంటే గడిచిన 24 గంటల్లో తిరుమల శ్రీవారిని 54,180 మంది భక్తులు దర్శించుకున్నారు. దీంతో శ్రీవారి హుండీకి రూ.3.20 కోట్ల ఆదాయం వచ్చి చేరుకుంది. అయితే తిరుమలలో చలి తీవ్రత అధికంగా ఉండటంతో.. భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా టీటీడీ అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. ముఖ్యంగా శ్వాస సంబంధించిన సమస్యలతో ఉన్నవారికోసం పలు కంపార్ట్మెంట్లలో వైద్యులను అందుబాటులో ఉంచినట్లు తెలిపారు.

Advertisement

Next Story

Most Viewed