- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
Game Changer: గేమ్ ఛేంజర్ సినిమా కోసం రామ్ చరణ్, శంకర్ ఎంత తీసుకున్నారంటే?
దిశ, వెబ్ డెస్క్ : గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ( Ram Charan ) హీరోగా తెరెకెక్కిన సినిమా " గేమ్ ఛేంజర్ "( Game Changer ). సెన్సేషనల్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమాలో కియారా అద్వానీ హీరోయిన్ గా నటిస్తోంది. దీంతో ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. ఇప్పటికే ఈ మూవీ నుంచి రిలీజ్ అయిన పాటలు, పోస్టర్స్ అందర్నీ ఆకట్టుకున్నాయి. అలాగే, ఇటీవల రిలీజ్ అయిన ట్రైలర్ మూవీ పై భారీ హైప్ క్రియేట్ చేసింది. ఇక ఈ మూవీ సంక్రాంతి కానుకగా జనవరి 10న రిలీజ్ కానుంది.
శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకం పై దిల్ రాజు, శిరీష్ ఈ సినిమాని నిర్మించారు. కార్తీక్ సుబ్బరాజు కథని అందివ్వగా, తమన్ మ్యూజిక్ డైరెక్టర్ గా పని చేశారు. 2021లో మొదలైన షూటింగ్.. 2024లో పూర్తైంది. మరో రెండు రోజుల్లో ఈ మూవీ వరల్డ్ వైడ్ గా థియేటర్లలో రిలీజ్ కానుంది. ఈ నేపథ్యంలోనే గేమ్ ఛేంజర్ మూవీ గురించి ఇంట్రెస్టింగ్ విషయాలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఇదిలా ఉండగా.. " గేమ్ ఛేంజర్ " మూవీ కోసం రామ్ చరణ్ తీసుకున్న రెమ్యునరేషన్ గురించిన ఓ వార్త బయటకొచ్చింది.
తెలిసిన సమాచారం ప్రకారం, ఈ సినిమాకు రామ్ తన పారితోషికం రూ.90 కోట్లు కాకుండా రూ.65 కోట్లు పారితోషికం తీసుకుంటున్నట్లు టాక్ నడుస్తుంది. ఇక డైరెక్టర్ రూ.35 కోట్లు రెమ్యునరేషన్ తీసుకుంటున్నాడని జోరుగా ప్రచారం నడుస్తోంది. మరి, ఈ వార్తల్లో ఎంత వరకు నిజముందో తెలియాల్సి ఉంది.