బర్త్‌డే స్పెషల్‌..‘టాక్సిక్’ గ్లింప్స్ వచ్చేసిందోచ్.. నయా లుక్‌లో ఆకట్టుకుంటున్న రాకీ భాయ్(వీడియో)

by Kavitha |
బర్త్‌డే స్పెషల్‌..‘టాక్సిక్’ గ్లింప్స్ వచ్చేసిందోచ్..  నయా లుక్‌లో ఆకట్టుకుంటున్న రాకీ భాయ్(వీడియో)
X

దిశ, సినిమా: స్టార్ హీరో యశ్(Yash) ‘టాక్సిక్’ (Toxic) అనే సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. దీనికి గీతూ మోహన్ దాస్(Geethu Mohandas) దర్శకత్వం వహిస్తుండగా.. కేవీఎన్, మాస్టర్ మైండ్ క్రియేషన్స్(Monster Mind Creations) బ్యానర్‌పై నిర్మిస్తున్నారు. ప్రస్తుతం షూటింగ్ శరవేగంగా జరుపుకుంటున్న ఈ మూవీ వచ్చే ఏడాది విడుదల కాబోతుంది. ఇక ఈ సినిమాకు సంబంధించిన అప్డేట్స్ ఎప్పుడెప్పుడు వస్తాయా అని ప్రేక్షకులు ఎంతో ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు. ఈ క్రమంలో.. తాజాగా, మూవీ మేకర్స్ ‘టాక్సిక్’(Toxic) నుంచి బిగ్ అప్డేట్ ఇచ్చారు. ఈ రోజు యశ్ పుట్టినరోజు సందర్భంగా ‘టాక్సిక్’ గ్లింప్స్‌ విడుదల చేస్తూ మూవీపై మరింత హైప్ పెంచేశారు.

ఇక విడుదలైన గ్లింప్స్ చూస్తుంటే.. యష్ రెట్రో కారులో క్లబ్‌లోకి స్టైలిష్‌గా ఎంట్రీ ఇచ్చాడు. మరోవైపు క్లబ్‌లో యూత్ సరదాగా ఎంజాయ్ చేస్తుంటారు. ఆ సమయంలో యష్ ఓ అమ్మాయితో రొమాన్స్ చేస్తూ తన చేతిలో ఉన్న వాటర్ బాటిల్‌లో ఉన్న నీళ్లను ఆ మహిళపై పోశాడు. ఇంతటితో ఈ గ్లింప్స్ అయిపోతుంది. ఇక మేకింగ్ చూస్తుంటే రెట్రో స్టోరీలా అనిపిస్తోంది. ప్రస్తుతం విడుదలైన గ్లింప్స్ సినిమాపై ఆసక్తిని కలిగిస్తోంది.

Advertisement

Next Story

Most Viewed