YS Sharmila : విభజన హామీలపై మోడీతో ప్రకటన ఇప్పించండి : వైఎస్ షర్మిల

by Y. Venkata Narasimha Reddy |
YS Sharmila : విభజన హామీలపై మోడీతో ప్రకటన ఇప్పించండి : వైఎస్ షర్మిల
X

దిశ, వెబ్ డెస్క్: నేడు విశాఖ(Visakhapatnam Visit) పర్యటనకు వస్తున్న ప్రధాని నరేంద్ర మోడీ(Prime Minister Narendra Modi) తో రాష్ట్ర విభజన హామీలు(Bifurcation Guarantees) ప్రత్యేక హోదా(Special Status)లపై ప్రకటన చేయించండని సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, బీజేపీలను ఏపీ కాంగ్రెస్ చీఫ్ వైఎస్.షర్మిల(AP Congress Chief YS Sharmila) డిమాండ్ చేశారు. అలాగే విశాఖ స్టీల్ ప్రైవేటీకరణ లేదని మోడీతో చెప్పించండని ఎక్స్ వేదికగా డిమాండ్ చేశారు.

చంద్రబాబు ప్రధాని మోడీ కోసం ఎదురు చూస్తుంటే.. ఆయన ఇచ్చిన వాగ్దానాల కోసం రాష్ట్రం ఎదురు చూస్తోందని షర్మిల వ్యాఖ్యానించారు. విభజన హామీలపై చేసిన మోసాలపై నిలదీసేందుకు ప్రజానీకం ఎదురు చూస్తోందని..తిరుపతి వేదికగా మీ సమక్షంలోనే రాష్ట్రానికి 10 ఏళ్లు ప్రత్యేక హోదా అన్నారని,.10 ఏళ్లు కాదు 15 ఏళ్లు కావాలని మీరు అడిగారని..ఆ మాటలు కోటలు దాటాయి తప్పిస్తే.. చేతలకు దిక్కులేదని షర్మిల విమర్శించారు.

రాష్ట్రానికి సంజీవని లాంటి హోదా హామీని అందరు కలిసి ఆటకెక్కించారని మండిపడ్డారు. గతంలో మీరు చెప్పినట్లుగా వెనుకబడిన ప్రాంతాలకు ప్రత్యేక ప్యాకేజీ ఇచ్చిన పాపాన పోలేదని, ఢిల్లీని తలదన్నే రాజధాని కట్టలేదని, పారిశ్రామిక కారిడార్లు స్థాపన జరగలేదని, 10 ఏళ్లు దాటినా పోలవరం నుంచి చుక్క నీరు పారలేదని ఆమె ఎన్డీఏపై విమర్శలు గుప్పించారు. కడప స్టీల్ కట్టలేదని, విశాఖ ఉక్కును రక్షించలేదని, ఏటా 2 కోట్ల ఉద్యోగాల్లో కనీసం లక్ష ఉద్యోగాలు కూడా రాష్ట్రానికి ఇచ్చింది లేదని విమర్శించారు.

Advertisement

Next Story

Most Viewed