- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
కేటీఆర్ కి నిద్రలో ఉన్న ఫార్ములా ఈ నే వస్తుంది : గుత్తా అమిత్
దిశ,నల్లగొండ: నల్లగొండ జిల్లా కేంద్రంలో పాడి పరిశ్రమ అభివృద్ధి సంస్థ చైర్మన్ గుత్తా అమిత్ రెడ్డి ఇంట్లో ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడుతూ తెలుగు ప్రజలందరికీ సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు తెలిపారు. అలాగే రాష్ట్ర ప్రభుత్వం ప్రజల సంక్షేమం కోసం పాటుపడుతుంది అని అన్నారు.రైతు భరోసా జనవరి 26 నుంచి ప్రారంభం అవుతుంది, వ్యవసాయానికి అనుకూలంగా ఉన్న భూములకు ఎలాంటి పరిమితి లేకుండా సంవత్సరంలో ఒక ఎకరాకురూ. 12 వేలు ఇస్తున్నాం..రైతు భరోసా ఎందుకు ఇస్తున్నారు అంటే వ్యవసాయానికి పెట్టుబడికి సహాయం..రైతులకు ముందుగా పంటకు పెట్టుబడికి మాత్రమే ఇవ్వడం జరుగుతుంది. రోడ్లు,గుట్టలు,పంటకి అనుకూలం లేని భూములకు మాత్రమే రైతు భరోసా ఇవ్వడం జరుగుతుంది అని అన్నారు.రైతుల సూచనలు, సలహాల మేరకు ఈ నిర్ణయం ప్రభుత్వం తీసుకోవడం జరిగుతుంది.వ్యవసాయ పరంగా భూమి లేని వ్యవసాయ కూలికి 12 వేలు ఇస్తున్నట్లు మొదటగా 5 వేలు ఇస్తున్నట్లు తెలిపారు.రేషన్ కార్డులు విషయం లో నూతనంగా కొత్త రేషన్ కార్డులు ఇవ్వడం క్యాబినెట్ సమావేశంలో తీర్మానం చేశారు అని అన్నారు.3 లక్షల 60 వేల ఎకరాలకు ఆయకట్టుకు నీరు అందించే దిశగా డిండి కి 1800 కోట్ల రూపాయలతో ఈ బృహత్తర కార్యక్రమం తీసుకోవడం హర్షణీయం అన్నారు.త్రిబుల్ ఆర్ లో మన జిల్లా అభివృద్ధి చెందే దిశగా ప్రభుత్వం తొందరగా టెండరు స్థాయికి తీసుకొచ్చిన మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కి ధన్యవాదాలు తెలిపారు.
కాంగ్రెస్ పార్టీ రైతుల కోసం పని చేస్తున్న పార్టీ రైతు రుణమాఫీ అలాగే రైతులకు బోనస్ ఇవ్వడం తో కేటిఆర్ కి మాత్రం నిద్రలో కూడా ఫార్ములా ఈ నే వస్తుంది అని అన్నారు.ఢిల్లీలో జరిగిన ఒక సంఘటన లో బీజేపీ నాయకులు ఒక వ్యక్తి ప్రియాంక గాంధీ ని అగౌరపరిచేలా మాట్లాడిన అతను వెంటనే క్షమాపణ తెలపాలని అన్నారు.డైరీకి సంబందించిన సుమారు రోజుకు 4 లక్షల పాలు రావడం అమ్మడం 3 లక్షల లీటర్ల అమ్మకం జరుగుతుంది అన్నారు.పాడి రైతులకు గత ప్రభుత్వం లో సంస్థ కొంత లోటు లో ఉండటం వల్ల నేడు కొంత ఇబ్బందులు కలిగుతున్న ప్రభుత్వ సహాయ సహకరలతో 100 కోట్లు ప్రభుత్వం ఇవ్వడం తో మనకు బకాయి పడిన రైతులకు చెల్లింపు చేయడం జరుగుతుంది అన్నారు.పాడి రైతులకు అందరికి కూడా దేశంలో ఎక్కడా చెల్లించని ధర 47 నుండి 48 రూపాయలు చెల్లిస్తున్నట్లు తెలిపారు.ప్రభుత్వం ఆధ్వర్యంలో నడుస్తున్న సంస్థలలో విజయ డైరీ నుండి అందించే దిశగా అడుగులు వేస్తూ నష్ట నివారణ చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు.దేవాలయాల్లో కూడా నెయ్యి ని దేవాదాయ శాఖ వారికి వెళ్లేలా చర్యలు 1500 టన్నుల పాల పౌడర్ ని శిశు సంక్షేమ కార్యక్రమంలో భాగంగా మన విజయ డైరీ నుండి వారికి బలామృతం అందించే విధముగా చర్యలు తీసుకుంటామని అన్నారు.