- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
Snake: బతికి ఉండగానే పాముని మంటల్లో తగలబెట్టారు.. మండిపడుతున్న నెటిజన్స్( వీడియో)
దిశ, వెబ్ డెస్క్ : మనలో చాలా మంది పాములు ( Snakes) చూడగానే భయపడి పారిపోతుంటారు. కానీ, ఇవి మీరకున్నంత ప్రమాదకరమైనవి కాదు. వాటి మీద దాడి చేసినప్పుడే అవి కాటేస్తాయి. నిజానికి అవి మనిషిని చూస్తే.. ఆమడ దూరం పారిపోయేందుకు చూస్తాయి. పాముల వల్ల అనేక ఉపయోగాలు కూడా ఉన్నాయి. మానవ జాతి వాటినేం అర్థం చేసుకోకుండా పాము కనిపిస్తే చాలు.. బయటకి లాగి మరి కొట్టి చంపుతున్నారు. మనం నివసిస్తున్న భూమి అందరిది. దీనిపై బ్రతికే ప్రతి జీవికి సమాన హక్కు ఉంటుంది. మనం వాటికంటే తెలివైన వారమని వాటిని హింసించకూడదు. ఇండియాలో 351 రకాల పాము జాతులు గుర్తించారు. అయితే, వాటిలో 62 జాతులు మాత్రమే విషపూరితమైనవి.
పల్లెటూర్లలో లేదా అడవులలో పాములు ( Snakes) ఎక్కువగా కనిపిస్తాయి. పిల్లల నుంచి పెద్దల వరకు పామును చూసి బెదురుతారు. పాములకు సంబంధించిన ఎన్నో వీడియోలు నెట్టింట హల్చల్ చేస్తూనే ఉంటాయి. తాజాగా, వైరల్ అవుతోన్న ఓ వీడియోపై నెటిజన్లు మండిపడుతున్నారు. దానికి కారణం ఆ పాముని బాగా కొట్టి.. బతికి ఉండగానే మంటల్లో తగలబెట్టారు. దీనిపై నెటిజన్స్ రియాక్ట్ అయ్యి " ఇలా చేయడం తప్పు .. ప్రతీ దానికి శిక్ష అనుభవించాల్సి ఉంటుంది " అంటూ భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. ఇక జంతు ప్రేమికులైతే వెంటనే వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.