- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
TG: డాక్టర్లకు మంత్రి దామోదర కీలక ఆదేశాలు

దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్రంలో వైద్య సేవల బలోపేతానికి కృషి చేస్తున్నామని, ఈ దిశగా ప్రభుత్వ హాస్పిటళ్లలో అధునాతన సౌకర్యాల కల్పనకు సమగ్ర ప్రణాళికతో ముందుకు వెళ్తామని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ అన్నారు. అన్ని ప్రభుత్వ ఆసుపత్రులలో సరిపడా హెచ్ ఆర్, ఎక్విప్మెంట్, ఇన్ఫ్రాస్ట్రక్చర్, డ్రగ్స్, శానిటేషన్‌లపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని మంత్రి అధికారులను ఆదేశించారు. రాష్ట్రంలో అన్ని ప్రభుత్వ ఆసుపత్రులలో వైద్య సేవల బలోపేతానికి సమగ్ర ప్రణాళిక రూపకల్పనపై హైదరాబాదులోని ఆరోగ్యశ్రీ హెల్త్ కేర్ ట్రస్ట్ కార్యాలయంలో నిర్వహించిన సమీక్షలో మంత్రి దామోదర్ రాజనర్సింహ అధికారులకు దిశ నిర్దేశం చేశారు. ప్రభుత్వ ఆసుపత్రులపై ప్రజలకు నమ్మకం కలిగేలా బ్రాండింగ్ చేయాలని ఆయన సూచించారు. అన్ని రకాల డయాగ్నస్టిక్ సేవలు పేద ప్రజలకు అందుబాటులో ఉండేలా చూడాల్నారు. టూల్స్ అండ్ ప్లాంట్స్ నిర్వహణ కోసం అన్ని హాస్పిటళ్ల సూపరింటెండెంట్లకు నిధులను కేటాయించాలని క్రింది స్థాయి అధికారులను ఆదేశించారు.
ముఖ్యంగా జవాబుదారీతనం ఉండే విధంగా ప్రభుత్వ ఆసుపత్రుల నిర్వహణ ఆసుపత్రి సూపరింటెండెంట్‌లపై ఉండేలా చర్యలు చేపట్టాలన్నారు. గత సంవత్సర కాలంలో ప్రభుత్వ ఆసుపత్రులలో ఐపీ, ఓపీ, ఇతర సర్జరీల సంఖ్య పెరిగిందన్నారు . అన్ని ఆసుపత్రులలో సరిపడా డాక్టర్లు, నర్సింగ్ సిబ్బందిని త్వరలోనే నియమిస్తామన్నారు. వైద్యవిధాన పరిషత్‌ను డైరెక్టర్ ఆఫ్ సెకండరీ హెల్త్ కేర్‌గా మారుస్తామని మంత్రి దామోదర రాజనర్సింహా హామీ ఇచ్చారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో పల్లె దవాఖాన, పట్టణ దవాఖాన, పిహెచ్సీ , కమ్యూనిటీ హెల్త్ సెంటర్లలో నిర్ధారించిన అన్ని రకాల వైద్య సేవలు, మందులు విధిగా అందుబాటులో ఉండే విధంగా చర్యలు తీసుకుంటామన్నారు. జిల్లా స్థాయిలోనే 90 శాతం వైద్య సేవలు ప్రభుత్వ హాస్పిటళ్లలో అందుబాటులో ఉండే విధంగా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. రిఫరల్ సిస్టమ్ ద్వారానే టీచింగ్ హాస్పిటళ్లకు పేషెంట్లను అనుమతించడం ద్వారా నిమ్స్ , గాంధీ, ఉస్మానియా వంటి హాస్పిటళ్లపై ఒత్తిడి తగ్గిస్తామన్నారు. ప్రభుత్వ ఆసుపత్రులలో డ్యూటీ హవర్స్‌లో డాక్టర్లు తప్పనిసరిగా ఉండేలా చర్యలు తీసుకుంటామన్నారు.
ఈ సమీక్షలో రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ప్రభుత్వ కార్యదర్శి డాక్టర్ క్రిస్టినా జడ్ చొంగ్తూ, ఫ్యామిలీ వెల్ఫేర్ కమిషనర్ ఆర్వి కర్ణన్, టీజీ ఎంఎస్ఐడిసి ఎండీ హేమంత్, డైరెక్టర్ ఆఫ్ హెల్త్ డాక్టర్ రవీందర్ నాయక్, టీవీవిపి కమిషనర్ డాక్టర్ అజయ్ కుమార్ లు పాల్గొన్నారు.