రాష్ట్ర బడ్జెట్ లో బీసీ సంక్షేమానికి చిన్న చూపే

by Naveena |
రాష్ట్ర బడ్జెట్ లో బీసీ సంక్షేమానికి చిన్న చూపే
X

దిశ ప్రతినిధి,మహబూబ్ నగర్: బుధవారం శాసనసభలో ప్రవేశపెట్టిన రాష్ట్ర బడ్జెట్ లో బీసీల సంక్షేమానికి తక్కువ నిధులు కేటాయించి బీసీ లపై చిన్న చూపు చూపారని తెలంగాణ బీసీ మహాసభ రాష్ట్ర అధ్యక్షుడు మెట్టు కాడి శ్రీనివాస్ ఒక ప్రకటనలో విచారం వ్యక్తం చేశారు. ఈ ఆర్థిక సంవత్సరానికి మొత్తం వ్యయం 3,04,965 కోట్లుగా బడ్జెట్ తేల్చారని,రెవెన్యూ వ్యయం 5,2,26,982 కోట్లు కాగా, మూలధన వ్యయం 36,504 కోట్లుగా ప్రతిపాదించినట్లు ఆయన వివరించారు. విచిత్రం ఏమంటే అత్యధిక జనాభా కలిగిన బీసీ లకు 11,405 కోట్ల తక్కువ నిధులు,బీసీల కన్నా తక్కువ ఉన్న ఎస్సీ సంక్షేమ శాఖ కు 40,232 కోట్లు,ఎస్టీ రంగానికి 17,169 కోట్ల నిధులను భారీగా ఈ బడ్జెట్ లో కేటాయింపులు జరిపారని ఆయన ఆక్షేపించారు. దీన్ని బట్టి చూస్తే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సర్కార్ కు బీసీలపై ప్రేమ లేదని,ఉత్త నటన మాత్రమే అని తేలిపోయిందన్నారు. ఇట్టి పక్షపాత వైఖరి పై బీసీ మేధావులు,బహుజనులు స్పందించాల్సిన అవసరం ఉందని ఆయన కోరారు.

Next Story

Most Viewed