మైనారిటీల సంక్షేమానికి కట్టుబడి ఉన్నాం

by Sridhar Babu |
మైనారిటీల సంక్షేమానికి కట్టుబడి ఉన్నాం
X

దిశ, మల్హర్(కాటారం) : మండల కేంద్రంలోని బీఎల్ఎం గార్డెన్‌లో రంజాన్ పండుగ సందర్భంగా ముస్లింలకు రాష్ట్ర ఐటీ, పరిశ్రమల, అసెంబ్లీ వ్యవహారాల శాఖ మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు గురువారం ఇఫ్తార్ విందు ఏర్పాటు చేశారు. ముందుగా ముస్లింలతో కలిసి మంత్రి ప్రార్థనలు చేశారు.ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రంజాన్ మాసం త్యాగం, సహనానికి ప్రతీక అని, సమాజంలో ఐక్యత, ప్రేమ పెంపొందించే పర్వదినమని తెలిపారు. ప్రభుత్వం మైనారిటీల సంక్షేమానికి కట్టుబడి ఉందని, రాష్ట్రంలోని ముస్లిం సోదరుల అభివృద్ధికి అన్ని విధాలా కృషి చేస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో ట్రేడ్ కార్పొరేషన్ చైర్మన్ ఐతా ప్రకాష్ రెడ్డి, జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ, ఎస్పీ కిరణ్ ఖరే, కాటారం సబ్ కలెక్టర్ మయాంక్ సింగ్, ముస్లిం మత పెద్దలు పాల్గొన్నారు.

Next Story

Most Viewed