- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
జిఎం సార్ మా గ్రామాన్ని అభివృద్ధి చేయరా?

దిశ,టేకులపల్లి : మండలంలోని పెట్రాం చెలుక స్టేజి ఇల్లందు ఏరియా కోయగూడెం ఓసి ప్రభావిత ప్రాంతమైన అభివృద్ధికి నోచుకోలేదని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. గురువారం గ్రామస్తుల ఆధ్వర్యంలో రోడ్డుపై బైఠాయించి రాస్తారోకో నిర్వహించారు. గ్రామంలో ఎటువంటి అభివృద్ధి సింగరేణి యాజమాన్యం చేయలేదని వారు ఆరోపించారు. కేవలం దుమ్ము, దూళి మాత్రమే మాకు అభివృద్ధిగా సింగరేణి యాజమాన్యం చేసిందని వారు ఆరోపించారు. మా ఊర్లో ఉన్నటువంటి ఆంజనేయ స్వామి ఆలయం అభివృద్ధి చేస్తామని మాటలు చెప్పి సింగరేణి యాజమాన్యం వదిలేసిందని గ్రామస్తులు ఆరోపించారు. గ్రామస్తులు మా ఊరిని అభివృద్ధి పథంలో నడపాలని అలాగే రోడ్లు, సైడ్ డ్రైనేజీలు, రోడ్డు సెంట్రల్ లైట్లు ఏర్పాటు చేయాలని ఇల్లందు ఏరియా జిఎంకు ధర్నా అనంతరం లేఖ ను గ్రామస్తులు సింగరేణి యాజమాన్యానికి ఇచ్చారు. బోడు పోలీసులు గ్రామస్థులకు సర్ది చెప్పి ధర్నాని విరమింప చేశారు. ఈ ధర్నా కార్యక్రమంలో గ్రామస్తులు పాల్గొన్నారు.