Wedding Dates: పెళ్లి చేసుకోవాలనుకుంటున్నారా? ఏప్రిల్ నెలలో మంచి ముహూర్తాలివే!

by D.Reddy |
Wedding Dates: పెళ్లి చేసుకోవాలనుకుంటున్నారా? ఏప్రిల్ నెలలో మంచి ముహూర్తాలివే!
X

దిశ, వెబ్ డెస్క్: శుభకార్యం ఏదైనా సరే హిందూ సంప్రదాయం ప్రకారం ముహూర్తం చూడాల్సిందే. ముఖ్యంగా పెళ్లిళ్లకు మంచి గడియాలు తప్పనిసరి. వధూవరుల పేర్లతో సరైన ముహూర్తం కుదరలేదని నెలల తరబడి పెళ్లిళ్లు కూడా వాయిదా వేస్తుంటారు. సంక్రాంతి మూఢం తర్వాత ఫిబ్రవరి, మార్చి నెలల్లో భారీగా శుభ ముహూర్తాలు వచ్చాయి. దీంతో ఎన్నో జంటలు ఒక్కటయ్యాయి. మార్చి 14న హోళీ పండుగ తర్వాత మూఢం రావటంతో పెళ్లిళ్లకు బ్రేక్ పడింది. ఈనెల 30వ తేదీన ఉగాది పండుగతో 'విశ్వానామ' సంవత్సరంలోకి అడుగుపెడుతున్నాం. కొత్త పంచాంగం ప్రకారం.. ఏప్రిల్ 13తో మూఢం కూడా తొలగిపోతుంది.

ఈ నేపథ్యంలో ఏప్రిల్ నెలలో భారీగా శుభ ముహుర్తాలు ఉన్నట్లు పండితులు చెబుతున్నారు. ఈ నెలలో ఇంత ఎక్కువగా పెళ్లి ముహూర్తాలు రావటం చాలా అరుదు అని కూడా అంటున్నారు. చైత్ర మాసం బహుళ పక్షం పాడ్యమి తిథి నుంచి మొత్తం 9 ముహూర్తాలు ఉన్నాయి. అంటే.. ఏప్రిల్ 14వ తేదీ నుంచి 30 తేదీ వరకు ముహూర్తాలు ఉండటంతో రెండు తెలుగు రాష్ట్రాల్లో వేలాది వివాహాలు జరగనున్నాయి.

ఏప్రిల్ నెలలో ముహూర్తాలు ఇవే..

* 14, 16, 18, 19, 20, 21, 25, 29, 30

గమనిక: ఈ ముహూర్తాలు ప్రాంతాలు, రాష్ట్రాలను బట్టి కాస్తా అటు, ఇటుగా మారతాయి. ఈ సమాచారాన్ని పరిగణలోనికి తీసుకునే ముందు పండితులను సంప్రదించండి.

Advertisement
Next Story

Most Viewed