- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
న్యాయవాదిని హత్య చేసిన నిందితుడికి ఉరిశిక్ష పడాలి

దిశ,ఆమనగల్లు: హైదరాబాద్ లో ప్రముఖ న్యాయవాది ఇజ్రాయిల్ ను కత్తితో పొడిచి అతికిరాతకంగా చంపిన నిందితుడుని ఫాస్ట్ ట్రాక్ కోర్టు వెంటనే విచారణ జరిపి ఉరిశిక్ష విధించేల ప్రభుత్వం చర్యలు చేపట్టాలని ఆమనగల్ బారసోసియేషన్ అధ్యక్షులు మల్లేపల్లి జగన్, ప్రధాన కార్యదర్శి దుడ్డు ఆంజనేయులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా మంగళవారం ఆమనగల్లు బారాసోసియేషన్ ఆధ్వర్యంలో.. విధులను అడ్వకేట్స్ బహిష్కరించారు. ఈ కార్యక్రమంలో అడ్వకేట్స్ పాల్గొని ప్లకార్డులతో నిరసన వ్యక్తం చేశారు. కోర్టు ఆవరణ నుండి బస్టాండ్ వరకు ర్యాలీ నిర్వహించారు. నిందితునికి ఉరి శిక్ష పడాలని, అదేవిధంగా ప్రభుత్వం వెంటనే అడ్వకేట్ ప్రొటెక్షన్ యాక్ట్ ని అమలు చేయాలని వారు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో న్యాయవాదులు రామకృష్ణ, శేఖర్, మధు, మల్లేష్,జగన్ గౌడ్, గణేష్, సంతోష్, కృష్ణ, మల్లేష్, శిరీష్, బిక్కనాయక్, మురళి కృష్ణ, నరేందర్, సర్దార్, మల్లేష్, శ్రీనివాస్ తదితరులున్నారు.