నగర పాలక సంస్థలో ఆన్‌లైన్‌సేవలకు అంతరాయం..

by Aamani |
నగర పాలక సంస్థలో ఆన్‌లైన్‌సేవలకు అంతరాయం..
X

దిశ,ఖమ్మం సిటీ : నగరపాలక సంస్థ కార్యాలయంలో ఆన్‌లైన్‌ సేవలకు అంతరాయం ఏర్పడింది. దీంతో ప్రజలు ఎల్ఆర్ఎస్, ఇంటి, పంపు పన్నులు చెల్లింపు కు తీవ్ర జాప్యం జరుగుతోంది. మార్చి నెలాఖరు కావడంతో ప్రభుత్వం కి కట్టాల్సిన పన్నుల చెల్లింపుల కోసం ఆరాటపడుతున్న వారికి నిరాశే ఎదురవుతోంది. దీంతో అధికారులు ప్రజలు అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పలేక తలలు పట్టుకుంటున్నారు. కొంత మంది అధికారులు ఏమి చెప్పలేక కార్యాలయాలు వదిలి వెళ్లే పరిస్థితి ఏర్పడింది. ప్రతి శాఖలో ఇదే పరిస్థితి ఉందని ప్రజలు ఆగ్రహిస్తున్నారు. వెంటనే ఉన్నతాధికారులు ఈ విషయం పై స్పందించి చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.

Next Story

Most Viewed