Mad Square Movie Review: మ్యాడ్ స్క్వేర్ రివ్యూ..నవ్వులతో హిట్ కొట్టారా లేదా

by Kavitha |   ( Updated:2025-03-28 07:45:29.0  )
Mad Square Movie Review: మ్యాడ్ స్క్వేర్ రివ్యూ..నవ్వులతో  హిట్ కొట్టారా లేదా
X

దిశ, వెబ్‌డెస్క్: నార్నె నితిన్(Narne Nithin), రామ్ నితిన్(Ram Nithin), సంగీత్ శోభన్(Sangeeth Sobhan), విష్ణు(Vishnu) ప్రధాన పాత్రలో తెరకెక్కిన మూవీ ‘మ్యాడ్ స్క్వేర్’(Mad Square). ఇది సూపర్ హిట్ విజయం సాధించిన ‘మ్యాడ్’(Mad) సినిమాకు సీక్వెల్‌గా వచ్చిన సంగతి తెలిసిందే. అయితే శ్రీకర స్టూడియోస్, సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్స్ పై హారిక సూర్యదేవర, సాయి సౌజన్య నిర్మాణంలో కళ్యాణ్ శంకర్(Kalyan Shankar) దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కింది. అయితే భారీ అంచనాల నడుమ ఈ చిత్రం థియేటర్లలో గ్రాండ్‌గా రిలీజ్ అయింది. మరి ఈ సినిమా హిట్టా, ఫట్టా అనేది ఇప్పుడు మనం చూద్దాం..

కథ విషయానికొస్తే.. మ్యాడ్ సినిమాకు మూడేళ్ళ తర్వాత కొనసాగింపుగా ఉంటుంది. ఇంజనీరింగ్ అయ్యాక మనోజ్(రామ్ నితిన్) బార్ టెండర్ గా, అశోక్(నార్నె నితిన్) వాళ్ళ ఆస్తి కోసం పోరాడుతూ, DD (సంగీత్ శోభన్) ఊళ్ళో సర్పంచ్ అవ్వాలని ఎవరి పనుల్లో వాళ్ళు ఉంటారు. లడ్డు(విష్ణు) పెళ్లి ఫిక్స్ అయిందని తెలియడంతో ముగ్గురు కలిసి పెళ్లికి వెళ్తారు. కానీ లడ్డుని చేసుకోబోయే అమ్మాయి ఈ ముగ్గురితో కలిసి వచ్చిన ఇంకో అబ్బాయితో లేచిపోతుంది.

దీంతో లడ్డు బాధలో ఉంటే ముగ్గురు ఫ్రెండ్స్ కలిసి గోవాకి తీసుకెళ్తారు. అదే సమయంలో గోవాలో ఓ పురాతనమైన నక్లెస్ దొంగతనం జరుగుతుంది. ఆ నక్లెస్ వీళ్ళే దొంగతనం చేశారని భాయ్(సునీల్) వీళ్ళని బెదిరిస్తాడు. అది వీళ్ళే చేశారేమో అని పోలీసులు వీళ్ల వెంట పడతారు. లడ్డు పెళ్లిలో ఏం జరిగింది? ఆ నక్లెస్ ఎవరు దొంగతనం చేశారు? వీళ్లంతా ఆ కేసు నుంచి ఎలా తప్పించుకున్నారు? అనేది తెలియాలంటే తెరపై చూడాల్సిందే.

సినిమా రివ్యూ.. నార్నె నితిన్, రామ్ నితిన్, సంగీత్ శోభన్, విష్ణు.. మెయిన్ లీడ్స్‌లో వచ్చిన మ్యాడ్ సినిమా ఫుల్ కామెడీతో నవ్వించి పెద్ద హిట్ అవ్వడంతో దానికి సీక్వెల్‌గా వచ్చిన ఈ మ్యాడ్ స్క్వేర్ సినిమాపై అంచనాలు బాగానే ఉన్నాయి. ఫస్ట్ హాఫ్ అంతా లడ్డు పెళ్లిలో ఫుల్ కామెడీతో నవ్విస్తారు. గోవాకి వెళ్ళాక అక్కడ వీళ్లు నక్లెస్ కేసులో ఇరుక్కోవడంతో నెక్స్ట్ ఏం జరుగుతుంది అని సెకండ్ హాఫ్ మీద ఆసక్తి నెలకొంటుంది. ఇక సెకండ్ హాఫ్‌లో ఫ్రెండ్స్ అంతా కలిసి నక్లెస్ కోసం వెతకడం, పోలీసులు వీళ్ల కోసం వెతకడంతో సాగుతుంది. ఫస్ట్ హాఫ్ లో మ్యాడ్ సినిమా రేంజ్‌లో ఫుల్‌గా నవ్వించారు. సెకండ్ హాఫ్‌లో మాత్రం ఆ నవ్వులు కాస్త తగ్గుతాయి. ఫైనల్‌గా సినిమా మిక్స్డ్ టాక్ తెచ్చుకుంటుంది.

Next Story

Most Viewed