ED Investigation: ఈడీ విచారణకు గంపగుత్తగా ఆబ్సెంట్.. సమయం కావాలన్న కేటీఆర్

by Shiva |
ED Investigation: ఈడీ విచారణకు గంపగుత్తగా ఆబ్సెంట్.. సమయం కావాలన్న కేటీఆర్
X

దిశ, తెలంగాణ బ్యూరో: ఫార్ములా ఈ-కార్ రేస్ ఈడీ విచారణకు హజరవ్వాల్సిన ఏ1, ఏ2, ఏ3లు ముకుమ్మడిగా డుమ్మా కొడుతున్నారు. మంగళవారం విచారణకు హజరవ్వాల్సిందిగా మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌కు ఈడీ అధికారులు నోటీసులు అందజేశారు. కేటీఆర్ విచారణకు హజరవుతారా.. లేదా? అనే సందిగ్ధత‌కు కేటీఆర్ హజరవ్వడం లేదని సమాధానం తెలిపారు. ఏసీబీ తనపై నమోదు చేసిన ఎఫ్ఐఆర్‌ను రద్దు చేయాలని ఇప్పటికే హైకోర్టులో వేసిన కేసులో తీర్పు రిజర్వు ఉందని తెలుపుతూ, విచారణకు హజరుకాలేనని ఈడీ అధికారులకు సమాధానం ఇచ్చారు. హైకోర్టు పైన ఉన్న గౌరవంతో తీర్పు వెలువరించే వరకు తనకు సమయం ఇవ్వాలని కోరినట్టు తెలిపారు. ఫార్ములా ఈ రేసు కేసును ఈడీ అధికారులు డిసెంబర్ 20న నమోదు చేశారు.

ఫార్ములా ఈ కార్ రేస్2పై ఏసీబీ పెట్టిన కేసు‌పై కేటీఆర్ క్వాష్ పిటిషన్ విచారణ జరిగే లోపు ఈడీ అధికారులు కేటీఆర్‌కు షాక్ ఇచ్చారు. ఏసీబీ కేసులో ఏ1గా ఎలా పేర్కొన్నారో ఈడీ కేసులో కూడా ఏసీబీ ఎఫ్ఐఆర్ ఆధారంగా కేటీఆర్‌ను ఏ1‌గా పేర్కొన్నారు. ఏ2గా సీనియర్ ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్, ఏ3గా హెచ్ఎండీఏ మాజీ చీఫ్ ఇంజినీర్ బీఎల్ఎన్ రెడ్డిని అని తేల్చారు. జనవరి 2న ఏ3గా ఉన్నా హెచ్ఎండీఏ మాజీ చీఫ్ ఇంజినీర్ బీఎల్ఎన్ రెడ్డిని, జనవరి 3న ఏ2గా ఉన్న సీనియర్ ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్‌ను ఈడీ విచారణకు హజరు కావాలని నోటీసులలో తెలిపారు. వారు హజరు కాకపోవడంతో జనవరి 8, 9 తేదీలలో హజరు కావాలని నోటీసులు అందజేశారు. ఈడీ విచారణకు హజరయ్యే అంశంలో కేటీఆర్ ఇప్పటికే లీగల్ టీంతో సంప్రదింపులు జరిపి హజరు కావడానికి సమయం అడిగినట్టు తెలుస్తుంది.

ఏసీబీ విచారణ‌పై క్వాష్ పిటిషన్ హైకోర్టు ఉన్నందున ఏసీబీ అధికారులు వీరిని విచారించలేదు. 31న హైకోర్టు విచారణ‌పై ప్రశ్నించిన అనంతరం ఏసీబీ అధికారలు విచారణకు హజరు కావాలని నోటీసులు అందజేశారు. ముందుగా కేటీఆర్‌ను విచారిచేందుకు ఏసీబీ అధికారులు నోటీసులు అందజేశారు. సోమవారం విచారణకు హజరవ్వాల్సిన కేటీఆర్ తన లాయర్‌తో మాత్రమే హజరువుతానని తెలిపారు. ఏసీబీ అధికారులు అందుకు అంగీకరించక పోవడంతో విచారణకు హజరు కాకుండా తన స్టేట్‌మెంట్ నమోదు చేసుకోండని లేఖ‌ను ఏసీబీ ఏఎస్పీకి అందజేసి అక్కడి నుంచి వెళ్ళిపోయారు. ఈడీ విచారణలో డుమ్మా కొట్టిన వాళ్లు ప్రణాళిక ప్రకారం చేస్తున్నరని ఈడీ, ఏసీబీ అధికారులు భావిస్తున్నారు. ఎవరు ముందు విచారణకు హజరవుతారో వారు చెప్పిన సమాధానం బట్టి మిగతా వారు చెప్పే విధంగా ప్రణాళికలు సిద్ధం చేసుకున్నట్టు తెలుస్తుంది. ఇదిలా ఉంటే కేటీఆర్ విజ్ఞప్తిపై ఈడీ స్పందించింది. విచారణ కోసం త్వరలోనే మరో తేదీని ప్రకటిస్తామని ఈడీ స్పష్టం చేసింది.

కేటీఆర్ క్వాష్ పిటిషన్ పై నేడు తీర్పు

కేటీఆర్ క్వాష్ పిటిషన్‌పై మంగళవారం హైకోర్టు తీర్పు వెలువడునుంది. ఏసీబీ కేసు కొట్టి వేయాలన్న కేటీఆర్ పిటిషన్‌పై డిసెంబర్ 31న వాదనలు ముగిశాయి. జస్టీస్ లక్ష్మణ్ నేతృత్వంలోని ధర్మాసనం ఇరు వాదనలు పరిశీలించిన అనతంరం తీర్పును రిజర్వ్ చేసింది. తుది తీర్పు వచ్చే వరకు కేటీఆర్‌ను అరెస్టు చేయవద్దని హైకోర్టు ఏసీబీ అధికారులకు ఆదేశాలిచ్చింది. ఈ మేరకు మంగళవారం ఉదయం 10:30గంటకు హైకోర్టు తీర్పు వెల్లడించనుంది. ఈ కేసులో కేటీఆర్ తరపున అడ్వకేట్ ప్రభాకర్ రావు.. ప్రభుత్వం తరపున అడిషనల్ అడ్వకేట్ జనరల్ బాల‌మోహన్ రెడ్డి తమ వాదనలు వినిపించారు.

Advertisement

Next Story

Most Viewed