బంగారు మైసమ్మ దేవాలయంలో చోరీ..

by Aamani |
బంగారు మైసమ్మ దేవాలయంలో చోరీ..
X

దిశ,బెల్లంపల్లి : మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి లో ఓ దేవాలయంలో గుర్తు తెలియని దొంగలు చోరీకి పాల్పడ్డారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. పట్టణంలోని కన్నాల జాతీయ ప్రధాన రహదారి పక్కన ఉన్న బంగారు మైసమ్మ దేవాలయంలో మంగళవారం రాత్రి గుర్తు తెలియని వ్యక్తులు గుడి తలుపులు పగలగొట్టి ప్రవేశించారు. బీరువా పగలగొట్టి అందులో ఉన్న 15 తులాల వెండి, పావుతులం బంగారం ముక్కుపుడకను ఎత్తుకెళ్లారు. అంతకుముందు దొంగలు సీసీ టీవీ కెమెరా కేబుల్ ను కట్ చేశారు. సంఘటన సమాచారం తెలియగానే బెల్లంపల్లి రూరల్ సీఐ అఫ్జలుద్దీన్, తాళ్ల గురజాల ఎస్సై రమేష్ ఘటన స్థలాన్ని సందర్శించారు. పోలీస్ జాగిలాలు, క్లూస్ టీం రంగంలోకి దిగింది. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

Next Story

Most Viewed