JPC: జమిలి ఎన్నికలపై జేపీసీ తొలి భేటీ

by Prasad Jukanti |
JPC: జమిలి ఎన్నికలపై జేపీసీ తొలి భేటీ
X

దిశ, డైనమిక్ బ్యూరో: జమిలి ఎన్నికల (One Nation One Election) బిల్లుపై ఏర్పాటైన జేపీసీ (JPC) తొలి సమావేశం ప్రారంభమైంది. జేపీసీ చైర్మన్ పీపీ చౌదరి (PP Chaudhary) ఆధ్వర్యంలో ఈ సమావేశం జరుగుతోంది. ఈ సమావేశంలో వన్ నేషన్ వన్ ఎలక్షన్ చట్టానికి సంబంధించిన వివరాలను న్యాయ మంత్రిత్వ శాఖ అధికారులు జేపీసీకి తెలియజేయనున్నారు. ఈ సమావేశానికి ముందు న్యూస్ ఏజెన్సీతో మాట్లాడిన జేపీసీ చైర్మన్ ఈ అంశంలో సభ్యుల మధ్య ఏకాభిప్రాయం ఏర్పడుతుందని విశ్వాసం వ్యక్తం చేశారు. ఏకాభిప్రాయానికి, జేపీసీ కృషి ఉంటుందని చెప్పారు. ఏకాభిప్రాయం సాధించి బిల్లులను నిష్పక్షపాతంగా పరిశీలించేందుకు జేపీసీ కృషి చేస్తుందన్నారు. రాజకీయ పార్టీలు, పౌర సంఘాలు, న్యాయవ్యవస్థ నుండి ప్రతి రంగంలోని వ్యక్తుల అభిప్రాయాలు పరిగణలోకి తీసుకుంటామని ప్రభుత్వం ప్రవేశపెట్టిన బిల్లులను నిష్పక్షపాతంగా, ఓపెన్ మైండ్‌తో పరిశీలిస్తామని చెప్పారు.

Advertisement

Next Story

Most Viewed