మళ్లీ ముఖ్యమంత్రిగా జగన్: దేవినేని అవినాశ్ కీలక వ్యాఖ్యలు

by srinivas |
మళ్లీ ముఖ్యమంత్రిగా జగన్: దేవినేని అవినాశ్ కీలక వ్యాఖ్యలు
X

దిశ, వెబ్ డెస్క్: ప్రభుత్వ వైఫల్యాలపై వైసీపీ(Ycp) ఫోకస్ పెట్టింది. ఎన్నికల్లో ఇచ్చిన హామీలు అమలు చేయాలంటూ డిమాండ్ చేస్తోంది. ఇందులో భాగంగా ప్రభుత్వంపై పోరాటం ప్రకటించింది. ఈ మేరకు ఆ పార్టీ నేతలు విజయవాడ(Vijayawada)లో ఆందోళనలు నిర్వహించారు. వైసీపీ జిల్లా అధ్యక్షుడు దేవినేని అవినాశ్(Devineni Avinash) మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టి ఆరు నెలలు దాటినా రాష్ట్రంలో ఒక్క సంక్షేమ పథకం అమలు చేయలేదని అవినాశ్ విమర్శించారు.

అమ్మ ఒడి, రైతులకు పెట్టుబడి సాయం, ఆరోగ్యశ్రీ, ఫీజు రీఎంబర్స్మెంట్, మహిళలకు 1500 వంటి పథకాలను నీరుగర్చారని దేవినేని అవినాశ్ మండిపడ్డారు. తమ వైఫల్యాన్ని కప్పిపుచ్చుకోవడానికి ప్రజలకు ఇచ్చిన హామీలను సోషల్ మీడియాలో ప్రశ్నిస్తే వారిపై కేసులు మోపి జైలుకు పంపిస్తున్నారని ఆరోపించారు. ఇప్పటికే రాష్ట్రంలో కూటమికి ఓటు వేసిన 15 శాతం పైగా ప్రజలు తిరుగుబాటు చేస్తున్నారని తెలిపారు. సూపర్ సిక్స్ పథకాల పేరిట ప్రజలకు హామీలిచ్చి రాష్ట్రంలో చంద్రబాబు డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారని ఎద్దేవా చేశారు. కూటమి ప్రభుత్వం చేసే నిరంకుశ పాలనకు రానున్న కాలంలో ప్రజలే తగిన విధంగా బుద్ధి చెబుతారని హెచ్చరించారు. రాబోయే రోజుల్లో మళ్లీ ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి(Ys Jagan Mohan Reddy)ని చేయటానికి రాష్ట్ర ప్రజలు సిద్ధంగా ఉన్నారని అవినాశ్ పేర్కొన్నారు.

Advertisement

Next Story

Most Viewed