బ్రేకింగ్ న్యూస్.. పట్టాలు తప్పిన గూడ్స్ రైలు

by Mahesh |
బ్రేకింగ్ న్యూస్.. పట్టాలు తప్పిన గూడ్స్ రైలు
X

దిశ, వెబ్ డెస్క్: సికింద్రాబాద్ నుంచి గుంటూరు వెళ్తున్న గూడ్స్ రైలు(Goods train) పట్టాలు తప్పింది(derailed). వెంటనే అప్రమత్తమైన లోకో పైలట్ సడన్ బ్రేకులు వేయడంతో భారీ ప్రమాదం తప్పినట్లు తెలుస్తుంది. పొందుగల-నడికుడి మధ్య మంగలవారం తెల్లవారుజామున ఈ ఘటన చోటు చేసుకుంది. గూడ్స్ రైలు పట్టాలు తప్పడంతో ప్రధాన మార్గంలోని రైలు రాకపోకలకు తీవ్ర అంతరాయం(Severe disruption) ఏర్పడింది. దీంతో ఎక్కడి రైళ్లను అక్కడే నిలిపివేశారు. మిర్యాలగూడ రైల్వే స్టేషన్(Miryalaguda Railway Station)లో తిరుమల స్పెషల్(Tirumala Special) రైలును నిలిపివేశారు. అలాగే నర్సాపూర్, కాచిగూడ ఎక్స్‌ప్రెస్ రైళ్లు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. మరో మూడు రైళ్లను విజయవాడ(vijayawada) మీదుగా హైదరాబాద్ మళ్లిస్తున్నారు. గూడ్స్ రైలు పట్టాలు తప్పిన ప్రాంతంలో సింగిల్ లైన్ ట్రాక్(Single line track) ఉండటంతో తీవ్ర అంతరాయం ఏర్పడింది. కాగా ఈ ఘటన సమాచారం అందుకున్న రైల్వే అధికారులు(Railway officials) హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపడుతున్నట్లు తెలుస్తుంది. మధ్యాహ్నం వరకు ట్రాక్ పనులు పూర్తి కావచ్చని అంచనా వేస్తున్నారు. దీంతో మార్గమధ్యంలో చిక్కుకుని పోయిన రైళ్లు.. అప్పటి వరకు సదరు స్టేషన్లలోనే నిలిచిపోనున్నాయి.

Advertisement

Next Story