రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ టీపీసీసీ అధ్యక్షుడికి ఘన స్వాగతం..

by Sumithra |
రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ టీపీసీసీ అధ్యక్షుడికి ఘన స్వాగతం..
X

దిశ, కొండమల్లేపల్లి : తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ వ్యవహారాల ఇన్చార్జి దీపాదాస్ మున్షీ తెలంగాణ రాష్ట్ర పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ఆదివారం నాగార్జున సాగర్ లో నిర్వహిస్తున్న బంజారా ఆత్మీయ సమ్మేళనం కార్యక్రమానికి వెళ్లారు. ఈ క్రమంలోనే కొండమల్లెపల్లి మండల కేంద్రంలోని పాల కేంద్రం గెస్ట్ హౌస్ వద్ద మర్యాదపూర్వకంగా పార్టీ శ్రేణులతో కలిసి పుష్పగుచ్ఛం అందజేసి, శాలువాతో సత్కరించారు దేవరకొండ ఎమ్మెల్యే నేనావత్ బాలునాయక్.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ వచ్చే స్థానిక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఎంపీపీలు, జడ్పీటీసీలు, సర్పంచులు, క్లీన్ స్వీప్ కావాలని మరొకరికి అవకాశం ఇవ్వకుండా పార్టీ శ్రేణులు కష్టపడి గెలిపించుకోవాలని సూచించారు. అనంతరం బీఎస్పీ రాష్ట్ర నాయకులు ఏకుల రాజారావు రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు చేతుల మీదుగా కాంగ్రెస్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.ఈ కార్యక్రమంలో సిరాజ్ ఖాన్, వేణుధర్ రెడ్డి, కైజర్ ఖాన్, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు వేమన్ రెడ్డి, యూత్ అధ్యక్షుడు మంగ్య నాయక్, మండల నాయకులు జితేందర్ యాదవ్, పార్టీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed