- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
Allu Arjun: నేడు కిమ్స్ ఆసుపత్రికి హీరో అల్లు అర్జున్..
దిశ, వెబ్‌డెస్క్: ‘పుష్ప-2’ (Pushapa-2) ప్రీమియర్ షో సందర్భంగా ఆర్టీసీ క్రాస్ రోడ్స్‌లోని సంధ్య థియేటర్ (Sandhya Theatre) ఎదుట జరిగిన తొక్కిసలాట రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన విషయం అందరికీ తెలిసిందే. అయితే, ఆ దుర్ఘటనలో రేవతి (Revathi) అనే మహిళ ప్రాణాలు కోల్పోయింది. ఆమె కుమారుడు శ్రీతేజ్ (Sri Tej) బ్రెయిన్ డ్యామేజ్ అయి గత 35 రోజులుగా కిమ్స్ ఆసుపత్రి (KIMS Hospital)లోని ఐసీయూ (ICU) విభాగంలో చావుబతుకుల మధ్య చికిత్స పొందుతున్నాడు. ఈ క్రమంలోనే సినీ ఇండస్ట్రీ ప్రముఖులు, ప్రభుత్వ పెద్దల మధ్య మాటల యుద్ధం చోటుచేసుకుంది. తొక్కిసలాటలో ప్రాణాలు కోల్పోయిన కుటుంబాన్ని హీరో అల్లు అర్జున్ (Allu Arjun), నిర్మాతలు (Producers), దర్శకుడు పరామర్శించలేదని విమర్శలు గుప్పించారు.
ఈ క్రమంలోనే తాజాగా, నాంపల్లి కోర్టు (Nampally Court) అల్లు అర్జున్ (Allu Arjun)కు రెగ్యులర్ బెయిల్ (Regular Bail) మంజూరు చేయడంతో ఆయన కిమ్స్ ఆసుపత్రికి వెళ్లి శ్రీతేజ్‌ను పరామర్శించనున్నారు. ఈ మేరకు ఇవాళ ఉదయం 10 గంటలకు ఆయన ఇంటి నుంచి నేరుగా కిమ్స్ ఆసుపత్రికి వెళ్లి శ్రీతేజ్, కుటుంబ సభ్యులతో మాట్లాడనున్నారు. మరోవైపు ఒకవేళ కిమ్స్ ఆసుపత్రికి వెళ్లాలనుకుంటే తమకు ముందస్తు సమాచారం ఇవ్వాలని రాంగోపాల్‌పేట్ పోలీసులు అల్లు అర్జున్‌కు నోటీసులు జారీ చేశారు. అయితే, వారి నుంచి పర్మీషన్ తీసుకుని అల్లు అర్జున్ శ్రీ తేజ్‌ను పరామర్శించేందుకు వెళ్తున్నారు.