దిశ ఎఫెక్ట్...అక్రమ వెంచర్‌పై అధికారుల చర్యలు

by Kalyani |
దిశ ఎఫెక్ట్...అక్రమ వెంచర్‌పై అధికారుల చర్యలు
X

దిశ, తొర్రూరు:- మహబూబాబాద్ జిల్లా తొర్రూరు పట్టణ శివారులోని నాంచారి మడూరు సమీపంలో ఉన్న సర్వే నం. 24/C గల భూమిలో సుమారుగా 5-7 ఎకరాల్లో అక్రమ వెంచర్ ఏర్పాటు చేయబడినట్లు దిశ దినపత్రిక ద్వారా వెలుగులోకి వచ్చింది. ఈ సమాచారం అందుకున్న సంబంధిత అధికారులు తక్షణమే స్పందించారు. అక్రమ వెంచర్‌ ప్రాంతంలో ఏర్పాటుచేసిన రాళ్లను తొలగించి, ఆ స్థలం అక్రమ వెంచర్‌గా గుర్తించబడిందని, అలాగే ఆ స్థలాన్ని కొనుగోలు చేయరాదు లేదా విక్రయించరాదు అని హెచ్చరిక బోర్డులు నాటించారు.

ఈ సందర్భంగా నాంచారి మడూర్ పంచాయతీ సెక్రటరీ మాట్లాడుతూ, "అక్రమ వెంచర్లు ప్రజలకు ఆర్థిక నష్టం కలిగించే ప్రమాదం ఉంది. వీటిపై చర్యలు తీసుకోవడం వలన ప్రజలకు న్యాయం జరుగుతుంది," అని తెలిపారు.అధికారుల చొరవను ప్రజలు అభినందించడమేకాక, భవిష్యత్తులో ఇలాంటి అక్రమ కార్యక్రమాలకు ఎదురీదేందుకు ప్రతి ఒక్కరూ ముందుకు రావాలని పిలుపునిచ్చారు.

Advertisement

Next Story

Most Viewed