Mahesh Kumar Goud: రాహూల్ గాంధీ తాపత్రయం మొత్తం దానిపైనే

by Gantepaka Srikanth |
Mahesh Kumar Goud: రాహూల్ గాంధీ తాపత్రయం మొత్తం దానిపైనే
X

దిశ, వెబ్‌డెస్క్: జల్- జమీన్-జంగిల్(నీరు, అటవీ, భూ వనరులు) నినాదాన్ని ఆదర్శంగా తీసుకొని.. గిరిజన హక్కుల పరిష్కారానికి కాంగ్రెస్(Congress) కట్టుబడి ఉందని టీపీసీసీ(TPCC) చీఫ్, ఎమ్మెల్సీ మహేశ్ కుమార్ గౌడ్(Mahesh Kumar Goud) హామీ ఇచ్చారు. ఆదివారం నాగర్జున సాగర్ విజయ్ విహార హోటల్‌లో నిర్వహించిన ఆదివాసీ శిక్షణ శిబిరంలో మహేశ్ కుమార్ గౌడ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సహజ వనరులపై గిరిజనుల హక్కుల కోసం రాహుల్ గాంధీ యాత్ర చేశారని గుర్తుచేశారు. ప్రధానిగా రాహుల్ గాంధీ చూడాలని తమ కల అని.. కల కోసం కాంగ్రెస్ కార్యకర్తలు సైనికులుగా పనిచేయాలని సూచించారు. ప్రజల ఆక్రందన, ఆవేదనను అర్థం చేసుకోవడమే రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర లక్ష్యమని చెప్పారు. గిరిజనుల హక్కులను కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కాలరాస్తోందని విమర్శించారు. గిరిజనుల అభివృద్ధి కోసం పరితపిస్తున్న నాయకుడు రాహూల్ గాంధీ అని అన్నారు. నాగార్జున సాగర్ అంటేనే శిక్షణ శిబిరాలకు నిలయమని చెప్పారు. బుద్ధుడికి నిలయమైన నాగర్జున సాగర్‌లో గిరిజనులు శిక్షణ శిబిరం ఏర్పాటు చేయడం హర్షించదగ్గ విషయమన్నారు.

కాంగ్రెస్ పార్టీ ఆదివాసీల పరిరక్షణ కోసం ఎనలేని కృషి చేసిందని తెలిపారు. కులగణన సర్వేపై దేశ వ్యాప్తంగా చర్చ జరుగుతుందని అన్నారు. కులగణన సర్వే 90 శాతం పూర్తయిందని తెలిపారు. గిరిజనులు న్యాయపరమైన హక్కుల కోసం సంఘటితం కావాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. అటవీ హక్కుల చట్టాన్ని కాంగ్రెస్ పార్టీ తీసుకొచ్చిందని గుర్తుచేశారు. ఈ శిక్షణ శిబిరంలో ఏఐసీసీ ఇంచార్జ్ దీపా దాస్ మున్షి, ఏఐసీసీ కో-ఆర్డినేటర్(ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, మైనార్టీ)కొప్పుల రాజు, మాజీ మంత్రి కుందూరు జానారెడ్డి, పాల్గొన్న డీసీసీ అధ్యక్షులు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, పోటీ చేసిన అభ్యర్థులు, కార్పొరేషన్ చైర్మన్‌లు, సీనియర్ నాయకులు పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed