108 అంబులెన్స్ లేక అవస్థలు..

by Aamani |   ( Updated:2025-01-03 07:41:44.0  )
108 అంబులెన్స్ లేక అవస్థలు..
X

దిశ, మర్పల్లి: మండల కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో 108 అంబులెన్స్ లేక ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.రోగికి అత్యవసర చికిత్స సమయంలో 108 అంబులెన్స్ అందుబాటులో ఉంటే ఆక్సిజన్ ఇతర సౌకర్యాలు ఉండడంతో రోగి ప్రాణాలను కాపాడడం సులువవుతుంది.మండలంలోని పేద ప్రజలకు వైద్యం చేయించుకోవడానికి మర్పల్లి మండల కేంద్రంలోని ఉన్న 40 పడకల ప్రభుత్వ ఆసుపత్రి పెద్ద దిక్కు.ప్రతిరోజు ఓపి విభాగంలో 200 మంది పేషెంట్లు పైగా వైద్యం చేయించుకునేందుకు వస్తుంటారు.అదేవిధంగా మర్పల్లి లో ప్రసూతి విభాగం ఉన్నందున డెలివరీలు కూడా చాలా వరకు జరుగుతూనే ఉంటాయి.

చికిత్స అత్యవసరం సమయంలో వైద్యులు రెఫర్ చేసే సందర్భంలో జిల్లా ఆసుపత్రికి తరలించాలంటే ఆస్పత్రిలో అంబులెన్స్ లేక ప్రైవేట్ వాహనాలను ఆశ్రయించాల్సి వస్తుంది.108 అంబులెన్స్ కు ఫోన్ చేసిన సమయానికి రాకపోవడంతో ప్రైవేటు వాహనాలను ఆశ్రయించి రోగులను మెరుగైన చికిత్స కోసం దూరప్రాంతాలకు తరలిస్తున్నారు.దీంతో రోగుల జేబులు గుల్లవుతున్నాయి. ప్రైవేటు వాహనాలు డ్రైవర్లు అందినది తడవుగా అధిక డబ్బులు వసూలు చేస్తున్నారని ఆరోపణలు ఉన్నాయి.ఇప్పటికైనా వైద్య ఉన్నత అధికారులు స్పందించి మరుపల్లి మండల కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో 108 అంబులెన్స్ ను ఏర్పాటు చేసి ప్రజల ప్రాణాలను రక్షించాలని మండల విజ్ఞప్తి చేస్తున్నారు.

Advertisement

Next Story

Most Viewed