Adivasi Congress : సాగర్ లో ప్రారంభమైన ఆదివాసీ కాంగ్రెస్ ప్రతినిధుల శిక్షణ తరగతులు

by Y. Venkata Narasimha Reddy |
Adivasi Congress : సాగర్ లో ప్రారంభమైన ఆదివాసీ కాంగ్రెస్ ప్రతినిధుల శిక్షణ తరగతులు
X

దిశ, వెబ్ డెస్క్ : కాంగ్రెస్ పార్టీ ఆదివాసీ ప్రజాప్రతినిధుల(Adivasi Congress Representatives) శిక్షణ తరగతులు నాగార్జున సాగర్(Nagarjuna Sagar)విజయ విహార్ హోటల్ లో ప్రారంభమయ్యాయి. గిరిజన, ఆదివాసీ కాంగ్రెస్ పార్టీ ప్రతినిధుల శిక్షణ తరగతులకు హాజరయ్యారు. నేటి నుంచి వారం రోజుల పాటు శిక్షణ తరగతులు కొనసాగనున్నాయి. తెలంగాణ రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జి దీపా దాస్‌మున్షీ(Telangana Congress IN Charge Deepa Dasmunshi) శిక్షణ తరగతులను ప్రారంభించారు.

ఈ సమావేశాలకు టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ మంత్రి జానారెడ్డి, నల్గొండ ఎంపీ రఘువీర్ రెడ్డి, ఎమ్మెల్యేలు జైవీర్ రెడ్డి, నేనావత్ బాలు నాయక్, ఆదివాసీ కాంగ్రెస్ చైర్మన్, ట్రైకార్ చైర్మన్ బెల్లయ్య నాయక్, డీసీసీ అధ్యక్షులు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థులు, కార్పొరేషన్ చైర్మన్ లు, సీనియర్ నాయకులు పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed