OYO: ఓయో సంచలనం... ఇకపై పెళ్లి కాని జంటలకు 'నో రూమ్'

by Y. Venkata Narasimha Reddy |
OYO: ఓయో సంచలనం... ఇకపై పెళ్లి కాని జంటలకు నో రూమ్
X

దిశ, వెబ్ డెస్క్ : ప్రముఖ ట్రావెల్ బుకింగ్ సంస్థ ఓయో(OYO) రూమ్ బుకింగ్స్ లో సంచలన నిర్ణయం తీసుకుంది. ఇకపై పెళ్లి కాని జంటల(Unmarried Couples)కు 'నో రూమ్' పాలసీ(No Room Policy) అమలు చేస్తామని ప్రకటించింది. పెళ్లి కాని జంటలకు రూమ్ బుకింగ్ లేదంటూ చెక్ ఇన్ పాలసీలో కీలక మార్పులు చేసింది. ఇకపై యువతీ యువకులు తమ రిలేషన్‌షిప్‌కు సంబంధించి ఐడీ ప్రూఫ్స్ సమర్పించాల్సిందేనని, సరైన ఐడీ ప్రూఫ్ లేకపోతే బుకింగ్స్‌ తిరస్కరించే అధికారం తమ ప్రతినిధులుకు ఉంటుందని పేర్కొంది. ఉత్తర ప్రదేశ్‌లోని మీరట్ సిటీ నుండి ఓయో ఈ సరికొత్త నిర్ణయం అమలు చేయనున్నట్లుగా ప్రకటించింది. ఇకపై ఈ సిటీలోని హోటల్స్‌లో పెళ్లి కాని జంటలకు ప్రవేశం లేదని ఓయో తేల్చిచెప్పింది. మీరట్‌లో ఓయోతో అగ్రిమెంట్ చేసుకున్న హోటల్స్‌కు చెక్-ఇన్ పాలసీని మారుస్తున్నట్లు ఓయో ప్రకటించింది. మీరట్‌లోని తన భాగస్వామ్య హోటళ్లకు దీన్ని తక్షణమే అమలులోకి తీసుకురావాలని నిర్దేశించింది.

గ్రౌండ్ ఫీడ్‌బ్యాక్ ఆధారంగా, కంపెనీ దీన్ని మరిన్ని నగరాలకు విస్తరించనున్నట్లుగా సమాచారం. పెళ్లికాని వారికి, సరైన ఐడీ ప్రూఫ్స్ లేని వారికి రూమ్స్ ఇచ్చిన సందర్భాల్లో అసాంఘీక, అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోవడం సమస్యలకు దారితీసింది. కాగా ఓయో నార్త్ ఇండియా రీజియన్ హెడ్ పవాస్ శర్మ మాట్లాడుతూ ఓయో సురక్షితమైన, బాధ్యతాయుతమైన ఆతిథ్య పద్ధతులను అనుసరించడానికి కట్టుబడి ఉన్నామని తెలిపారు. తాము వ్యక్తిగత స్వేచ్ఛను గౌరవిస్తున్నామని.. అలాగే చట్టాల అమలు, పౌరులతో కలిసి పని చేయడం, వినడం మా బాధ్యతగా గుర్తించామన్నారు. అయితే ఇదే శాశ్వత విధానం కాదని, కాలానుగుణంగా చెక్‌ ఇన్‌ పాలసీని మార్చివేసే అవకాశం ఉంటుందని చెప్పారు. కుటుంబాలు, విద్యార్థులు, వ్యాపారులు, ఒంటరి ప్రయాణికులకు సురక్షితమైన అనుభవాన్ని కలిగించే దిశగా కొత్త నిర్ణయాలుంటాయని వెల్లడించారు.

Advertisement

Next Story

Most Viewed