- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
బెల్లంపల్లిలో క్షుద్ర పూజల కలకలం..
దిశ, బెల్లంపల్లి : మంచిర్యాల జిల్లా బెల్లంపల్లిలో క్షుద్ర పూజలు కలకలం రేపాయి. బెల్లంపల్లి పట్టణం కన్నాలబస్తీలో ఓ ఇంటి ముందు క్షుద్ర పూజల ఘటన మంగళవారం చోటుచేసుకుంది. మారుపాక శ్రీనివాస్ ఇంటి ముందు క్షుద్రపూజలు చేసిన ముగ్గులు వెలిశాయి. తెల్లవారు ఇంటి నుంచి బయటికి వచ్చేసరికి ఇంటి ముందు వెలసిన క్షుద్ర పూజల ముగ్గులను చూసి శ్రీనివాస్ కుటుంబ సభ్యులు కంగుతిన్నారు. గుర్తుతెలియని వ్యక్తులు ఇంటి దర్వాజ ముందే క్షుద్రపూజలు చేయడం ఇది గిట్టని వారి పనేనని శ్రీనివాస్ కుటుంబ సభ్యులు వాపోయారు. స్థానికంగా ఈ క్షుద్ర పూజల వ్యవహారం చర్చనీయాంశంమైంది.
ఇంటి ముందు క్షుద్రపూజలు జరగడంతో భయాందోళనతో మారుపాక శ్రీనివాస్ కుటుంబ సభ్యులతో ఇంటికి తాళం వేసి వెళ్లిపోయారు. క్షుద్ర పూజలకు పాల్పడిన గుర్తు తెలియని వ్యక్తుల పట్ల బస్తీ వాసులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. క్షుద్ర పూజలు కార్మిక క్షేత్రంలో తీవ్ర భయాందోళనలు రేకిత్తిస్తున్నాయి. గతంలో కూడా ఇదే మాదిరి కన్నాల బస్తీలో క్షుద్ర పూజలు చేసిన వైనాన్ని కాలనీవాసులు గుర్తు చేసుకొని చర్చించుకుంటున్నారు. మళ్లీ అదే తరహాలో క్షుద్ర పూజలు కాలనీలో ప్రత్యక్షం కావడంతో బస్తీవాసులు హడలెత్తిపోతున్నారు. పాత కక్షల నేపథ్యంలోనే ఈ క్షుద్ర పూజల పనని బస్తీ ప్రజలు చర్చించుకుంటున్నారు. శ్రీనివాస్ ఇంటి ముందు వెలిసిన క్షుద్ర పూజల ముగ్గులను చూడడానికి బస్తీ ప్రజలు తెగ ఆసక్తి కనబరిచారు. ఇలా ఇంటి ముందు క్షుద్రపూజలు చేపించడం తగదని బస్తీవాసులు మాట్లాడుకోవడం కనిపించింది.