- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
Ramesh Bidhuriఛ బీజేపీ నేత రమేష్ బిధూరీపై పార్టీ చర్యలు.. ఢిల్లీ ఎన్నికల్లో పోటీకి దూరం..!
దిశ, నేషనల్ బ్యూరో: ఢిల్లీ ఎన్నికల వేళ బీజేపీ నేత రమేష్ బిధూరీ(Ramesh Bidhuri)కి షాక్ తగిలింది. కాంగ్రెస్ అగ్రనేత, ఎంపీ ప్రియాంక గాంధీ (Priyanka Gandhi)పై వివాదాస్పద వ్యాఖ్యలు చేయడంతో ఆయనపై పార్టీ చర్యలకు పూనుకుంది. ఆయన్ని అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయకుండా తప్పించేందుకు రెడీ అయ్యింది. ఢిల్లీ సీఎం అతిశీ, ప్రియాంక గాంధీపై చేసిన వ్యాఖ్యలపై పార్టీ అధినేత జేపీ నడ్డా ఆయన్ను మందలించినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే చర్యలకు సిద్ధమైనట్లు సమాచారం. రమేశ్ బిధూరీ పోటీ చేస్తున్న ఢిల్లీ అసెంబ్లీ స్థానం నుంచి ఆయనను తప్పించడం లేదా మరో చోటుకి మార్చడంపై పార్టీ దృష్టిపెట్టినట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలకు ఇటీవలే బీజేపీ అభ్యర్థుల జాబితా ప్రకటించింది. కాల్కాజీ నియోజకవర్గం నుంచి రమేష్ బిధూరీ పోటీ చేస్తున్నట్లు పార్టీ ప్రకటించింది. అయితే, ఇదే స్థానం నుంచి ఢిల్లీ ముఖ్యమంత్రి అతిషీ బరిలో దిగనున్నారు. దీంతో, ఈ రాజకీయ పరిణాలతో బిధూరీని తప్పించి మహిళా నేతను పోటీలో దించాలని బీజేపీ అధిష్ఠానం యోచిస్తోంది. ఈ అంశంపై చర్చలు జరుగుతున్నట్లు.. ఆయన స్థానంలో పోటీ చేసే బలమైన మహిళా నేత కోసం ప్రయత్నాలు జరుగుతున్నట్లు పార్టీ నేతలు వెల్లడించారు.
వివాదాస్పద వ్యాఖ్యలు
ఢిల్లీ సీఎం అతిశీపై, కాంగ్రెస్ ఎంపీ ప్రియాంక గాంధీపై రమేష్ బిధూరీ ఇటీవలే వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ‘‘సీఎం అతిశీ ఆమె తండ్రినే మార్చేశారు. గతంలో ఆమెకు ఒక ఇంటి పేరు ఉండగా.. ప్రస్తుతం మరో పేరుని ఉఫయోగిస్తున్నారు. ఉగ్రకార్యకరలాపాలకు పాల్పిడన అఫ్జల్ గురుకు క్షమాభిక్ష పెట్టాలని ఆమె పేరెంట్స్ పిటిషన్ కూడా వేశారు’’ అంటూ ఆయన ఆరోపించారు. ‘‘అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించాక ప్రియాంక గాంధీ బుగ్గల్లా రోడ్లను మారుస్తాం ’’ అని వివాదాస్పద కామెంట్లు చేశారు. దీంతో కాంగ్రెస్ నేతలు నిరసనలు చేపట్టారు. బీజేపీకి వ్యతిరేకంగా ఆందోళను చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే కాషాయ పార్టీ అధిష్ఠానం రమేష్ బిధూరీపై చర్యలకు సిద్ధమైంది.