- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
Renu Desai: 22 సంవత్సరాల తర్వాత మళ్లీ ఆ పని చేస్తున్న రేణు దేశాయ్.. పోస్ట్ వైరల్
దిశ, సినిమా: అలనాటి హీరోయిన్, పవన్ కళ్యాణ్ మాజీ భార్య రేణు దేశాయ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ‘బద్రి’, ‘జానీ’ వంటి సినిమాల్లో పవన్ కళ్యాణ్ సరసన నటించిన ఈ భామ.. అతనితో ప్రేమలో పడింది. అలా కొన్నేళ్లు లవ్‌లో ఉండి ఈ జంట పెళ్లి చేసుకున్నారు. వీరికి ఆద్య, అకిరా నందన్ అనే పాప, బాబు కూడా పుట్టారు. అయితే వీరిద్దరి మధ్య మనస్పర్థలు రావడంతో విడాకులు తీసుకుని వేరు వేరుగా ఉంటున్నారు. ఇక డివోర్స్ తర్వాత పవన్ కళ్యాణ్ వేరే పెళ్లి చేసుకుని ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎంగా వ్యవహరిస్తున్నాడు.
కానీ రేణు దేశాయ్ మాత్రం మరో పెళ్లి చేసుకోకుండా తన పిల్లల బాధ్యతలను చూసుకుంటుంది. అలాగే ఆద్య పేరు మీద యానిమల్ ట్రస్ట్‌ను నిర్వహిస్తుంది. నిత్యం సోషల్ మీడియాలో యాక్టీవ్‌గా ఉంటూ జంతువులకు సంబంధించిన వీడియోలు షేర్ చేయడమే కాకుండా తనకు తోచినంత సహాయం చేస్తూ నెటిజన్స్‌ని కూడా హెల్ప్ అడుగుతూ ఉంటుంది. అలాగే తన వ్యక్తిగత విషయాలను పంచుకుంటూ అభిమానులకు దగ్గరవుతూ ఉంటుంది. ఈ క్రమంలో ఈ భామ పోస్ట్ నెట్టింట వైరల్ అవుతోంది.
తాజాగా రేణు దేశాయ్ ఇన్‌స్టా వేదికగా ఓ పోస్ట్ పెట్టింది. అందులో ఓ యాడ్‌కి ఫొజలిచ్చిన ఫొటోను షేర్ చేస్తూ.. ‘22 ఏళ్ల తర్వాత మళ్లీ యాడ్ షూటింగ్‌కి వెళ్లాను. నేను యాడ్ షూటింగ్‌లను ఎంతగా ఇష్టపడతానో అంతే హ్యాపీగా ఫీల్ అవుతాను. నాకు ఫుల్ మూవీ చేయాలనే ఇంట్రెస్ట్ లేదు ఎప్పుడూ లేదు. కానీ కొన్ని కారణాల వల్ల అప్పుడు నటించాల్సి వచ్చింది. బట్ ఇప్పుడు మాత్రం పూర్తిగా సినిమాలకు ముగింపు ఇచ్చేశాను’ అంటూ క్యాప్షన్‌ను జోడించింది. ప్రస్తుతం ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారగా.. దీనిపై నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు.