Vishal: 12 ఏళ్ల తర్వాత విశాల్ సినిమాకు మోక్షం.. విడుదల తేదీపై అధికారిక ప్రకటన రిలీజ్

by Hamsa |   ( Updated:2025-01-03 11:11:42.0  )
Vishal: 12 ఏళ్ల తర్వాత విశాల్ సినిమాకు మోక్షం.. విడుదల తేదీపై అధికారిక ప్రకటన రిలీజ్
X

దిశ, సినిమా: ఏ సినిమా అయినా ఏడాదికి షూటింగ్ పూర్తి చేసుకుని విడుదలకు సిద్ధమవుతాయి. ఇక భారీ బడ్జెట్ చిత్రాలకైతే మూడు నాలుగేళ్లు పడుతుంది. అలాంటిది ఓ సినిమా షూటింగ్ పూర్తి చేసుకున్నప్పటికీ విడుదలకు నోచుకోలేదు. ఏకంగా 12 ఏళ్ల తర్వాత రిలీజ్ కాబోతుండటం విశేషం. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన విడుదల కావడంతో అభిమానులు ఆశ్చర్యపోవడం తో పాటు ఆనందపడుతున్నారు.

అసలు విషయంలోకి వెళితే.. హీరో విశాల్(Vishal), సుందర్ సి కాంబోలో తెరకెక్కిన చిత్రం ‘మదగజరాజ’(Madhagajaraja). ఇందులో అంజలి(Anjali), వరలక్ష్మి శరత్ కుమార్(Varalakshmi Sarath Kumar) హీరోయిన్లుగా నటించగా.. సదా ఐటమ్ సాంగ్‌లో చిందులేసింది. అలాగే కోలీవుడ్ నటుడు ఆర్య గెస్ట్‌ రోల్‌లో నటించగా.. సోనూసూద్(Sonu Sood), సంతానం కీలక పాత్రల్లో కనిపించనున్నారు. అయితే విజయ్ ఆంటోని(Vijay Antony) ఈ సినిమాకు సంగీతం అందించాడు.

ఇంతమంది స్టార్స్ నటించిన ఈ మూవీ షూటింగ్ పూర్తి చేసుకున్నప్పటికీ విడుదలవుతున్న క్రమంలోనే నిర్మాత సంతానం అడ్డుకున్నారు. తనకు ఇవ్వాల్సిన రెమ్యునరేషన్ ఇవ్వలేదని కోర్టును ఆశ్రయించడంతో రిలీజ్ వాయిదా పడింది. ఆ తర్వాత పలు చిక్కుల వల్ల 2012 నుంచి విడుదలకు బ్రేకులు పడుతుండటంతో అంతా దీని గురించి కూడా మర్చిపోయారు. ఇదిలా ఉంటే.. తాజాగా, ఈ సినిమా జనవరి 12న థియేటర్స్‌లో విడుదల కాబోతున్నట్లు అధికారిక ప్రకటన విడుదల అయింది. సుమారు 12ఏళ్ల తర్వాత రాబోతుండటంతో విశాల్ ఫ్యాన్స్ ఖుషీ అవుతున్నారు.

Advertisement

Next Story