- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
Keerthy Suresh: క్రిస్టియన్ పద్ధతిలో పెళ్లి.. నాన్న రియాక్షనిదే.. కీర్తి సురేశ్ కామెంట్స్ వైరల్
దిశ, వెబ్‌డెస్క్: టాలీవుడ్ ముద్దుగుమ్మ కీర్తి సురేష్(Keerthy Suresh) క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అక్కర్లేదు. ఈ బ్యూటీ అగ్ర హీరోల సినిమాల్లో అవకాశం కొట్టేసి.. టాలీవుడ్ పరిశ్రమలో అండ్ తెలుగు ప్రేక్షకుల్లో మంచి క్రేజ్ దక్కించుకుంది. ఇటీవలే బాలీవుడ్‌లోకి కూడా అడుగుపెట్టి.. తన సత్తా చాటుతోన్న విషయం తెలిసిందే. ఇకపోతే ఈ బ్యూటీ ఇటీవలే ప్రియుడు ఆంటోనీతో ఏడడుగుల బంధంలోకి అడుగులు పెట్టింది. హిందూ, క్రిస్టియన్ సంప్రదాయాల్లో కీర్తి సురేష్, ఆంటోనీ(Antony) వివాహం చేసుకున్నారు. అయితే కీర్తి సురేష్ ఓ ఇంటర్వ్యూకు హాజరై పెళ్లి గురించి పలు విషయాలు పంచుకుంది.
క్రిస్ట్రియన్ పద్ధతిలో వివాహం చేసుకోవాలని అనుకున్నామని.. ఈ విషయం నాన్నతో మాట్లాడనని కీర్తి చెప్పుకొచ్చింది. అయితే క్రిస్ట్రియన్ సంప్రదాయం ప్రకారం వివాహం చేసుకుంటే పెళ్లి కుమార్తెను తన తండ్రి స్టేజ్ పైకి తీసుకురావాలని.. కాగా నా కోసం మీరు అలా చేస్తారా నాన్న అని అడిగానని వెల్లడించింది. ఎందుకు చేయను తప్పకుండా చేస్తానని తన ఫాదర్ సమాధానమిచ్చాడని హ్యాపీ కామెంట్స్ చేసింది. హిందూ(Hindu), క్రిస్ట్రియన్(Christian) రెండు పద్ధతుల్లో పెళ్లి జరిపిస్తామని అన్నారని.. దీంతో నాకు ఆనందంతో పాటు.. షాక్ అయ్యానని వెల్లడించింది. ఇలా అడగ్గానే అలా వెంటనే నాన్న ఒప్పుకున్నారని ఇంటర్వ్యూలో నటి చెప్పుకొచ్చింది. ప్రస్తుతం కీర్తి సురేష్ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.