Vande Bharat Sleeper Train : వందే భారత్ స్లీపర్ రైలు ట్రయల్ రన్ సక్సెస్

by Y. Venkata Narasimha Reddy |   ( Updated:2025-01-04 12:31:29.0  )
Vande Bharat Sleeper Train : వందే భారత్ స్లీపర్ రైలు ట్రయల్ రన్ సక్సెస్
X

దిశ, వెబ్ డెస్క్ : దేశ రైల్వే సర్వీసులలో ప్రవేశానికి సిద్ధమైన వందే భారత్ స్లీపర్ (Vande Bharat Sleeper Train) రైళ్ల నిర్వహణ పరీక్షలను రైల్వేశాఖ(Railway Department) విజయవంతంగా పూర్తి (Successfully Completed)చేసింది. వందే భారత్ స్లీపర్ రైలు ట్రయల్ రన్ ను విజయవంతంగా నిర్వహించినట్లుగా రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్(Railway Minister Ashwini Vaishnav) 'ఎక్స్' వేదికగా వీడియో పోస్ట్ తో వెల్లడించారు. 180కేఎంపీహెచ్ వేగంతో వందే భారత్ స్లీపర్ రైలు దూసుకెళ్లిందని, అంత వేగంలోనూ ట్రేపై నీటి గ్లాసు తొణకకుండా సాఫీగా ప్రయాణం సాగిందని తెలిపారు. రాజస్థాన్ లోని కోటా రైల్వే డివిజన్లో కోటా నుంచి లబాన్ స్టేషన్ల మధ్య ఈ పరీక్షలు నిర్వహించారు.

వందే భారత్ స్లీపర్ రైలు న్యూఢిల్లీ-పూణే, న్యూఢిల్లీ-శ్రీనగర్ సహా పలు మార్గాల్లో నడపనున్నారు. వేగాన్ని క్రమక్రమంగా పెంచేందుకు పలు పరీక్షలు నిర్వహిస్తున్నారు. పరీక్షల్లో రైలు గరిష్ఠంగా గంటకు 180 కిలోమీటర్ల వేగాన్ని అందుకున్నట్లు తెలిసింది. తొలుత జనవరి 1న రైలును 130కేఎంపీహెచ్ వేగంతో నడిపారు. ఆ తర్వాత వేగాన్ని 140, 150, 160కి పెంచారు. తాజాగా ఈ వేగాన్ని గంటకు 180 కిలోమీటర్లకు పెంచారు. సాధారణ ప్రయాణికులను సమం చేసేంత బరువును రైల్లో ఉంచి విభిన్నమైన ట్రాక్ పరిస్థితుల్లో దీన్ని రైలు వేగాన్ని పరీక్షించారు.

వచ్చే నెలలోనూ ఈ ట్రయల్స్ కొనసాగుతాయని అధికారులు వెల్లడించారు. మరికొన్ని నెలల్లో వందే భారత్ స్లీపర్ రైళ్లను పట్టాలెక్కించే అవకాశాలున్నాయన్నారు. ఈ స్లీపర్ రైల్లో మొత్తం 16 బోగీలు ఉంటాయని అందులో 10 థర్డ్ ఏసీకి, 4 సెకండ్ ఏసీకి, ఒక బోగీ ఫస్ట్ ఏసీకి కేటాయించారని అధికార వర్గాలు పేర్కొన్నాయి. వందే భారత్ స్లీపర్ రైలులో సీటింగ్ తో పాటు లగేజీ కోసం రెండు బోగీలు అందుబాటులో ఉంటాయని వారు తెలిపారు.

Advertisement

Next Story

Most Viewed