Vaseline: తక్కువ ధరకే దొరికే ఈ అద్భుత వస్తువుతో ప్రయోజనాలు తెలిస్తే షాక్ అవ్వాల్సిందే!

by Prasanna |
Vaseline: తక్కువ ధరకే దొరికే ఈ అద్భుత వస్తువుతో ప్రయోజనాలు తెలిస్తే షాక్ అవ్వాల్సిందే!
X

దిశ, వెబ్ డెస్క్ : చలికాలం మొదలవ్వగానే అందరికీ వాజిలిన్‌ (Vaseline) గుర్తొస్తుంది. చర్మం, పెదవుల రక్షణకు వాజిలిన్‌ ను ఉపయోగిస్తారు. అయితే, కేవలం శీతాకాలంలోనే కాకుండా, వేసవి కాలంలో దీనిని ఉపయోగిస్తారు. మీ ఇంట్లో ఒక చిన్న వాజిలిన్‌ ఉంటే చాలు.. అనేక సమస్యలకు సులభంగా చెక్ పెట్టొచ్చు. ఇది మార్కెట్లో, తక్కువ ధరకే దొరుకుతుంది.

కళ్ల కింద బ్లాక్‌ సర్కిల్స్‌

అమ్మాయిల్లో చాలా మందికి కళ్ల కింద బ్లాక్‌ సర్కిల్స్‌ ఉంటాయి. రాత్రి పడుకునే ముందు కళ్ల చుట్టూ కొద్దిగా వాజిలిన్‌ రాసుకోవాలి. దీని వలన కళ్ల చుట్టూ ఉండే బ్లాక్‌ సర్కిల్స్‌ తగ్గుతుంది.

చిట్లిన జుట్టుకు పరిష్కారం

మహిళల్లో కొందరికీ జుట్టు చిట్లి బాధ పడుతుంటారు. వారు కొద్దిగా వాజిలిన్‌ ను జుట్టు చివర్లకు అప్లై చేసుకుంటే జుట్టు మృదువుగా ఉంటుంది.

బట్టలపై మరకలా?

మీకు ఇష్టమైన డ్రెస్‌పై మరకలు పడితే చాలా బాధగా ఉంటుంది. కానీ, మీ ఇంట్లో వాజిలిన్‌ ఉండగా.. చింతించాల్సిన పనిలేదు. మరకపై కొంచం దీనిని రాసి, తర్వాత ఉతికితే మరక పోతుంది.

జుట్టుకు రంగు వేయడం ఈజీ

జుట్టుకు రంగు వేసుకునేటప్పుడు చర్మానికి మరకలు పడటం సాధారణం. కాబట్టి, రంగు వేసుకునే ముందు నుదురు, చెవులకు వాజిలిన్‌ రాస్తే చర్మానికి అంటకుండా ఉంటుంది.

గమనిక: ఇక్కడ అందించిన సమాచారం పలు అధ్యయనాలు, పరిశోధనల నుంచి తీసుకోబడింది. ఇఈ సమాచారం కేవలం మీ అవగాహన కోసమే. ‘దిశ’ ఈ విషయాలను దృవీకరించడం లేదు.

Advertisement

Next Story

Most Viewed